టాలీవుడ్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, దీని తరువాత అల్లు అర్జున్ ఎవరితో మూవీ చేస్తారనేది ఆయన ఫ్యాన్స్ మదిలో ఎప్పటినుండో మెదులుతున్న ప్రశ్న. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, పుష్ప 2 అనంతరం త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ సినిమా చేయడం ఆల్మోస్ట్ ఫిక్స్ అని అన్నారు.
ఈ మూవీ భారీ పాన్ ఇండియన్ ప్రాజక్ట్ గా అత్యధిక వ్యయంతో నిర్మితం కానున్నట్లు చెప్పారు. అలానే ఇప్పటికే బోయపాటి శ్రీను ఆయన కోసం ఒక కథ లాక్ చేయగా అట్లీ సినిమా కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా ఇవి అన్ని కూడా త్రివిక్రమ్ మూవీ అనంతరమే పట్టాలెక్కనున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో ఇంకెంతమేర కెరీర్ పరంగా దూసుకెళ్తారో చూడాలి.