2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప ఆ చిత్ర హీరో అయిన అల్లు అర్జున్‌కి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. అలాగే ఆయన బ్రాండ్ విలువను చాలా వరకు పెంచింది. అందుకే తన తదుపరి సినిమా అయిన పుష్ప 2 ఆయన కెరీర్ కు చాలా కీలకంగా మారింది. దర్శకుడు సుకుమార్‌తో పాటు, ఈ ప్రాజెక్ట్ అంచనాలను మించిపోయేలా చేయడానికి బన్నీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అందరూ తనని అడిగే ప్రశ్న ఒకటే.. పుష్ప తర్వాత ఏమిటి?
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తదుపరి ఏమి చేయాలనే దాని పై ఇంకా ఆలోచిస్తున్నారు. నిజానికి ఇతర భాషా దర్శకులతో పనిచేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినా.. వారు తీసే సినిమాల వల్ల తెలుగు నేటివిటీని కోల్పోయే అవకాశం ఉంది అని ఆ ప్రయత్నాలు విరముంచుకున్నారు. అందుకే ఇంతవరకూ ఆయన తన తదుపరి సినిమా పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా ఇతర భాషా దర్శకులు తెలుగు స్ట్రెయిట్ సినిమాలను రీమేక్ చేసి ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారని ఇటీవలి ఫలితాలు ఇప్పటికే చూపించినందున అల్లు అర్జున్ ఆ తరహా ప్రయోగాలకు ఇష్టపడటం లేదు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తాజాగా హిందీలో రీమేక్ గా తెరకెక్కి భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఈ కారణంగానే త్రివిక్రమ్‌తో తదుపరి సినిమా చేయాలని ఆయన తహతహలాడుతున్నారు. కానీ, త్రివిక్రమ్ సినిమాకి పాన్-ఇండియన్ అప్పీల్ ఉండే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండటంతో త్రివిక్రమ్‌తో పనిచేయడం కూడా గందరగోళాన్ని సృష్టించింది. త్రివిక్రమ్ సినిమాలు, వాటి సబ్జెక్ట్‌లు తెలుగులోనే అద్భుతంగా వర్కవుట్ అవుతాయనే నమ్మకం బలంగా ఉంది. త్రివిక్రమ్ సినిమాల రీమేక్‌లు కూడా ఎప్పుడూ సరిగా ఆడలేదు. ఇటీవలి షెహజాదా యొక్క పేలవమైన ప్రదర్శన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అందుకే ఐకాన్ స్టార్ తను చేయబోయే సినిమాగా దేన్నీ ఎంచుకోవాలి అనే విషయమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఆ విషయం మీద నిర్ణయం తీసుకోవడానికి ఆయనకి ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది కాబట్టి తొందరపాటులో ఏ సినిమాకీ కమిట్ అవ్వకూడదనుకుంటున్నారు.