గంగోత్రి సినిమాతో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో నటుడిగా ఎంతో ఎదుగుతూ కెరీర్ పరంగా కొనసాగారు. ఇటీవల త్రివిక్రమ్ తెరకెక్కించిన అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ కెరీర్ పరంగా ఇప్పటివరకు మిగతా టైర్ 1స్టార్ హీరోలతో పోలిస్తే ఒక్క భారీ స్థాయి ఓపెనింగ్ డే 1 రికార్డును కూడా అందుకోలేకపోయారు.
తాజాగా పుష్ప 2 మూవీతో ఆ రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోబోతున్నారు. అందరిలో భారీ స్థాయి క్రేజ్ కలిగిన ఈ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ ని అలానే వరల్డ్ వైడ్ గా కూడా గ్రాండ్ ఓపెనింగ్ రికార్డ్స్ ని అందుకునే అవకాశం గట్టిగా కనబడుతోంది. ఈ విధంగా టాలీవుడ్ టైర్ 1 హీరోల్లో ఓపెనింగ్ రికార్డుని ఆఖరిగా అందుకుపోబోతున్న నటుడు అల్లు అర్జున్. ఇప్పటికే పుష్ప 2 పై అందరిలో కూడా భారీ స్థాయి క్రేజ్ ఉంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్ డే రూ. 300 కోట్లకు గ్రాస్ అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా గంగోత్రి సినిమాతో సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఒక్కొక్క సినిమాతో తన అత్యద్భుతమైన నటన టాలెంట్ తో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా లాస్ట్ నుంచి ది బెస్ట్ వరకు కూడా కొనసాగుతున్నారు. మరి పుష్ప 2 మూవీ ఆయనకు నటుడిగా ఏ స్థాయి క్రేజ్ ని ఆయన స్టామినాని నిరూపితం చేస్తుందో చూడాలి