ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 5న ఈ మూవీ గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. విషయం ఏమిటంటే నిన్న హైదరాబాదులో ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ నిజానికి పుష్ప సినిమాకు సంబంధించి మొదట ఒక చిన్న లైన్ మాత్రమే అల్లు అర్జున్ ని చెప్పానని ఆ తర్వాత అతని మీద ఇంట్రెస్ట్ తోనే కథని ఎంతో జాగ్రత్తగా తయారు చేసుకుని ఫైనల్ గా రెండు భాగాలు తీసామని అన్నారు.
ఇక ఈ సినిమాని తాను కేవలం అల్లు అర్జున్ కోసమే చేసానని, అతడు లేకపోతే ఈ మూవీనే లేదని, అంత అద్భుతంగా ప్రాణం పెట్టి పనిచేసాడని అన్నారు సుకుమార్. కాగా ఆయన మాటలకు అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. మొత్తంగా అటు సుకుమార్ కి ఇటు అల్లు అర్జున్ కి ప్రతిష్టాత్మకంగా మారిన పుష్ప 2 మూవీ భారీ స్థాయిలో అయితే అందరిలో క్రేజ్ ఏర్పరచింది. డిసెంబర్ 5న పలు భాషలు ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.