దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన గత చిత్రం విక్రమ్ తో భారీ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. దాంతో సహజంగానే, విక్రమ్ వంటి భారీ విజయం తర్వాత, దర్శకుడు తన LCU ను ఎలా ముందుకు తీసుకెళ్తారనే దాని పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇప్పుడు, లోకేష్ నిస్సందేహంగా తమిళ సినిమా పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న విజయ్‌తో యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ కోసం పని చేస్తున్నారన్న సంగతి మనకు తెలుసు.
కాగా అటు విజయ్ మరియు ఇటు లోకేష్ కనగరాజ్ ఇద్దరూ పెద్ద బ్రాండ్‌లు కలిసి ఒక సినిమా కోసం రావడంతో సినిమా భారీ బిజినెస్‌ను ఆర్జించడానికి సహాయపడుతుంది. తమిళ సినిమాల్లో నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా ఇప్పటికే ఈ సినిమా హక్కులు ఆల్ టైమ్ రికార్డ్ ధరలకు అమ్ముడయ్యాయి. కాగా ఇప్పుడు థియేట్రికల్ హక్కులు కూడా భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి.
కాగా ఓవర్సీస్ హక్కుల కోసం నిర్మాతకు 70 కోట్ల ధరను డిమాండ్ చేస్తున్నారు మరియు ఆఫర్‌లు ఇప్పటికే 60 కోట్ల స్థాయిలో ఉన్నాయి మరియు ఈ రెండు సంఖ్యల మధ్య ఒప్పందం ముగుస్తుందని సమాచారం అందుతోంది. మొత్తంగా తమిళ సినిమాకు ఇది ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ అవుతుంది.
తమిళ సినిమాలకు ఓవర్సీస్‌లో మార్కెట్ విపరీతంగా ఉంది మరియు అన్నీ సవ్యంగా సాగితే తమిళ సినిమాలు $15 మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేయగలవు. ఇటీవల, మణిరత్నం యొక్క PS1 $ 20 మిలియన్లకు పైగా వసూలు చేసింది కాబట్టి లియో సినిమాకు మంచి టాక్ వస్తే ఈ సినిమాతో రికార్డులు గల్లంతు అవడం ఖాయం.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియోలో విజయ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, సంజయ్ దత్, మాథ్యూ థామస్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ మరియు శాండీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.