తెలుగులో 2020 సంక్రాంతికి విడుదలై భారీ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి బాలీవుడ్ అధికారిక రీమేక్ గ తెరకెక్కిన షెహజాదా గత వారాంతంలో విడుదలైంది మరియు ఈ చిత్రం మొదటి వారాంతంలో దాదాపు 20 కోట్ల నికర వసూళ్లు సాధించింది, ఇవి చాలా తక్కువ స్థాయి వసూళ్లు అనే చెప్పాలి.
ఈ చిత్ర హీరో కార్తీక్ ఆర్యన్ గత చిత్రం భూల్ భూలయ్య 2 సూపర్ డూపర్ హిట్ అయినందున ఈ చిత్రం భారీగా స్కోర్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేశాయి. ఈ చిత్రం పరాజయం పాలవడంతో, తెలుగు నిర్మాతలకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకు ముందు దిల్ రాజు నిర్మించిన జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ రీమేక్‌లు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడంలో విఫలమవయ్యాయి.
ఇక షెహజాదా సినిమా ట్రైలర్ విడుదలైన క్షణం నుండ అల వైకుంఠపురములో చూపిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేదు ఏమో అన్న అనుమానాలు మొదలవగా, సినిమా విడుదలైన తర్వాత అల వైకుంఠపురములో చూసిన ప్రేక్షకులకు ఏమాత్రం రుచించకపోగా.. ఆ సినిమా చూడని బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది.
షెహజాదా నిర్మాతలు స్క్రిప్ట్‌లో చాలా అనవసరమైన మార్పులు చేసారు, అవి సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అల వైకుంఠపురములో సినిమా పాటలు, అల్లు అర్జున్ స్టైల్ మరియు ఫైట్స్ తో పాటు త్రివిక్రమ్ మార్కు సింపుల్, పవర్ ఫుల్ డైలాగ్స్‌కి బాగా పేరు పొందింది. అయితే అందులో నుంచి వినోదాత్మక సన్నివేశాలు దాదాపు అన్ని తీసివేయబడినందున, వీటిలో ఏవీ రీమేక్‌లో లేకుండా పోయాయి. తద్వారా షెహజాదా ఒక నిర్జీవ చిత్రంగా నిలిచింది.
అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భూలయ్యా 2 వంటి బ్లాక్ బస్టర్‌లో కనిపించిన తర్వాత కార్తీక్ ఆర్యన్ పెద్ద తెర పైకి తిరిగి వచ్చిన చిత్రం షెహజాదా. ఈ చిత్రంలో కృతి సనన్‌తో పాటు మనీషా కోయిరాలా, రోనిత్ రాయ్, సచిన్ ఖేడేకర్ మరియు అంకుర్ రాథీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. షెహజాదా చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహించారు మరియు టి-సిరీస్ ఫిల్మ్స్, హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ మరియు బ్రాత్ ఫిల్మ్స్‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు.