ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే అలవైకుంఠపురంలో అతిపెద్ద విజయం అందించింది. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఆ సినిమాతో నటుడిగా అల్లు అర్జున్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు.
అందులోని సాంగ్స్ నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాయి. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటించగా గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్ సంస్థలు ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలోని కథ, కథనాలు, అల్లు అర్జున్ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్, కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకొని ఓవరాల్ గా ఈ సినిమాకి పెద్ద విజయాన్ని అందించాయి. ఇక 2020లో రిలీజ్ అయ్యి పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అక్కడి నుంచి మంచి రెస్పాన్స్ తో నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న అలవైకుంఠపురంలో తాజాగా ఆ మాధ్యమం నుంచి తొలగించబడింది. దానికి ప్రధాన కారణం సన్ నెక్స్ట్ లో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతూ ఉండటమే.
మొత్తంగా ఇకపై అలవైకుంఠపురంలో చూడాలనుకునే వారికి సన్ నెక్స్ట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఈ సినిమాలోని బుట్ట బొమ్మ, సామజవగమన, రాములో రాముల సాంగ్స్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో ఇంకా మంచి వ్యూస్ తో కొనసాగుతూనే ఉన్నాయి.