అక్షయ్ కుమార్ తాజా చితం సెల్ఫీ నిన్న విడుదలైంది మరియు ఈ సినిమాకి కనీస స్థాయిలో ఓపెనింగ్స్ మరియు బజ్ లేకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. విడుదలకు ముందే ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్ నిరుత్సాహపరిచింది మరియు నిర్మాతలు మంచి మౌత్ టాక్ మరియు పాజిటివ్ రివ్యూలతో సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకుంటుందని ఆశించారు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ రెండూ జరగలేదు మరియు సినిమా భయంకరమైన ప్రారంభానికి దారితీసింది.
సెల్ఫీ అనేది పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు సూరజ్ వెంజరమూడు నటించిన 2019 మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ డ్రైవింగ్ లైసెన్స్‌కి రీమేక్. ఈ బాలీవుడ్ రీమేక్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి ఇమ్రాన్ హష్మీ నటించారు. ఇక ఈ సినిమాకి దూకుడుగా ప్రమోషన్లు చేసినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఓపెనింగ్ సాధించలేకపోయింది.
పఠాన్‌తో, హిందీ సినిమా మార్కెట్ బాగు పడిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావించాయి, అయితే గత వారం విడుదలయిన షెహజాదా 6 కోట్ల ఓపెనింగ్‌తో అందరి ఆలోచన తప్పని నిరూపించింది. ఇక తాజాగా అక్షయ్ కుమార్ యొక్క సెల్ఫీ మరీ దారుణంగా 2.25 కోట్ల నెట్ ఓపెనింగ్‌తో షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు తమకు ఆసక్తికరమైన కాంబినేషన్లు మరియు ఏదో ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లు ఉన్న సినిమాలు మాత్రమే చూడాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది, అలా అనిపించని సినిమాలను వారు ఏమాత్రం ప్రోత్సహించటం లేదు.