అఖిల్ అక్కినేని పాన్ ఇండియా సినిమా ఏజెంట్ రిలీజ్ డేట్ ఇప్పటికే కొన్ని సార్లు వాయిదా పడగా, తాజాగా వినిపిస్తున్న అంతర్గత వర్గాల వార్తలను నమ్మితే ఈ సినిమా రిలీజ్ డేట్ మరో సారి మారినట్లు తెలుస్తోంది.
అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అయితే వారికి నిరాశ కలిగించే విధంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఏజెంట్ ను ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంకా సినిమాకి సంభందించిన పనులు పూర్తి కానీ కారణంగా ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని, మేలో విడుదల కానుందని తెలుస్తోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏజెంట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పలు లాక్డౌన్లతో పాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2021 ఏప్రిల్లో ఈ చిత్రాన్ని ప్రారంభించగా, షూటింగ్ సమయంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంది.
మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర అఖిల్ అక్కినేని పాత్రకు గురువుగా సినిమా కథకు కేంద్ర బిందువుగా ఉంటుందని సమాచారం. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ ఈ చిత్రానికి మేజర్ హైలైట్ గా నిలవనుండగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.