Homeసినిమా వార్తలుAgent: సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న అఖిల్ ఏజెంట్ ట్రైలర్

Agent: సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న అఖిల్ ఏజెంట్ ట్రైలర్

- Advertisement -

నిన్న రాత్రి విడుదలైన అఖిల్ ‘ఏజెంట్’ ట్రైలర్ కు అన్ని ప్లాట్ ఫామ్స్ లో మంచి స్పందన వస్తోంది. రిచ్ విజువల్స్, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ తో చాలా నీట్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ సాధించింది. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, యూనిక్ మేనరిజమ్స్ ఖచ్చితంగా తనదైన ముద్ర వేశాయని, ఆయన చాలా మెచ్యూర్డ్ గా కనిపించారని ట్రైలర్ చూసిన వారు అందరూ అన్నారు. అఖిల్ లో ఒక స్టార్ తరహా వైబ్ ఉందని అన్నారు.

ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఫీస్ట్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక అందులో కనిపించిన స్టైలిష్ మేకింగ్ అయితే పక్కా సురేందర్ రెడ్డి బ్రాండ్ తో ఉంది. అదే ఈ సినిమాలో ఫుల్ గా కనిపిస్తుందని అందరూ భావిస్తున్నారు. ట్రైలర్ ఖచ్చితంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసి మంచి ఓపెనింగ్స్ తీసుకు వస్తుందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు.

అఖిల్ ఏజెంట్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ గా ఏకే ఎంటర్ టైన్ మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2021 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ చిత్రం దాదాపు 2 సంవత్సరాల చిత్రీకరణ తర్వాత ఇప్పుడు మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

READ  SSMB28: సంక్రాంతికి విడుదల కానున్న మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories