అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో పాటు విడుదలైన నిమిషాల్లోనే వైరల్ గా మారింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలు ఈ ట్రైలర్ ను రివ్యూ కూడా చేశారు.
కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, దీనికి సీబీఎఫ్సీ నుంచి యు/ఎ సర్టిఫికేట్ లభించిందని నిర్మాతలు అధికారికంగా ధృవీకరించారు. ‘ఏజెంట్’లో బ్లడ్ కర్లింగ్ ఫైట్స్ తో పాటు కొన్ని బూతు పదాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. “అల్టిమేట్ యాక్షన్ లాక్”, “వైల్డ్ యాక్షన్ ట్రీట్” అనే రెండు పదబంధాలను చిత్ర యూనిట్ ప్రచారంలో బాగా ఉపయోగించింది.
ఇక ఈ సినిమా రన్ టైం 156 నిమిషాలు (2 గంటల 36 నిమిషాలు). విభిన్న సన్నివేశాలు, పాత్రల ప్రాముఖ్యత విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఆలోచించి రన్ టైం లాక్ చేశారట. ఏజెంట్ కు సెన్సార్ టాక్, రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్ గా ఉందని, ఏజెంట్ నిజంగానే ఒక అద్భుతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడుగా వ్యవహరించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో వివిధ దేశాలు, ప్రాంతాల మధ్య ప్రయాణించే స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందిందని సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ను చుసుకోగా.. ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు.