Homeసినిమా వార్తలుThunivu: అజిత్ తునివు సినిమా నిడివి మరియు కథ వివరాలు

Thunivu: అజిత్ తునివు సినిమా నిడివి మరియు కథ వివరాలు

- Advertisement -

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి భారీ విడుదల తునివుతో తన విశేష అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కాగా ఈ సినిమా తాలూకు ప్రీ-సేల్స్ ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రారంభమయ్యాయి మరియు నివేదికల ప్రకారం, తునివు 143 నిమిషాల (2 గంటల 23 నిమిషాలు) రన్‌టైమ్‌ను కలిగి ఉందట. అయితే దీని పై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక అంతర్గత వర్గాల ద్వారా వినబడుతున్న తునివు కథ ఏమిటంటే.. ఒక ఆగంతక సూత్రధారి, తన బృందంతో కలిసి ఒక ప్రణాళిక రూపొందించి చెన్నై నగరం అంతటా బ్యాంకు దోపిడీలకు పాల్పడతాడు. కాని వారి దోపిడీల వెనక ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ తెలియదు.

ఈ కథాంశం వింటుంటేనే చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది మరియు భారీ యాక్షన్ డ్రామా ఉండేలా అనిపిస్తుంది. అజిత్ ఈ రకమైన నెగటివ్ షేడ్స్ పాత్రకు పర్ఫెక్ట్ ఇమేజ్ కలిగి ఉన్నారు మరియు ఖచ్చితంగా ఆయన ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్‌గా నటించడం ప్రేక్షకులను సినిమా పట్ల ఆకర్షితులను చేస్తుందనే చెప్పాలి.

ఇక తునివు సినిమాకి 2 గంటల 23 నిమిషాల రన్‌టైమ్ కూడా ఒక పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ కారణం వల్ల ఈ సినిమాకి థియేటర్లలో ఒక రోజులో ఎక్కువ షోలను కేటాయించే అవకాశం ఉంటుంది.

READ  వారిసు వివాదం వెనక ఉంది దిల్ రాజు మాఫియా నా లేక హీరో విజయ్ మాఫియా నా?

తునివు చిత్రం యొక్క రెండవ సింగిల్ ఈ డిసెంబర్ 18న విడుదలైంది మరియు జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు, ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి.

కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సింగిల్ చిల్లా చిల్లా మ్యూజికల్ ప్లాట్‌ఫారమ్‌లలో బాగా హిట్ అయింది మరియు లిరికల్ వీడియోకు జోడించిన మేకింగ్ వీడియోలో అజిత్ చాలా కూల్‌గా కనిపించారు.

‘తునివు’ బాక్సాఫీస్ వద్ద దళపతి విజయ్ యొక్క ‘ వారిసు’తో తలపడుతుంది. ఇలా ఇరు ప్రత్యర్థుల మధ్య ఒకే రోజు విడుదలలు కానుండడంతో ఇరు హీరోల అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

తునివులో మలయాళ నటి మంజు వారియర్, సముద్రఖని మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి పతాకం పై బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో తెగింపు పేరుతో విడుదలవుతోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  మళ్ళీ రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories