అఖిల్ అక్కినేని యొక్క స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ ఏప్రిల్ 28 నుండి థియేటర్లలో సందడి చేయనుండగా, ఈ చిత్ర ఫలితం ఆయన కెరీర్ కు చాలా కీలకంగా మారింది. అఖిల్ ఏజెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం 100 శాతం కష్టపడ్డారు. అలాగే టైర్-2 హీరోస్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కూడా ఇదే. ఏజెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టడం ద్వారా అఖిల్ నిజంగానే తనకి స్టార్ హీరో అయ్యే సత్తా ఉంది అని ఈ సారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే ఇంతకు ముందు ఏ టైర్-2 హీరో చేయని విధంగా ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాతో వస్తున్నారి. ఒకవేళ అఖిల్ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద లాగగలిగితే ఖచ్చితంగా ఇది తన కెరీర్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఏజెంట్ సినిమాలో ఒక అడవి కోతిలా ప్రవర్తించే పాత్రలో తాను కనిపిస్తానని.. అయితే ఈ సినిమా పూర్తిగా హీరో క్యారెక్టర్ పై మాత్రమే నడిచేది కాదని అఖిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మూడు పాత్రల మధ్య ఇంటెన్స్ డ్రామా ఉంటుందని, మరీ ముఖ్యంగా ప్రతి పాత్రకు ఒక గౌరవం ఉంటుందన్నారు. అంతర్జాతీయ గూఢచారి సమస్యలతో ముడిపడి ఉన్నందున ఏజెంట్ ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ విభాగంలో పని చేసిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిచారు.