సినిమా: ఏజెంట్
రేటింగ్: 2/5
తారాగణం: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియా
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపా రెడ్డి
విడుదల తేదీ: 28 ఏప్రిల్ 2023
దాదాపు రెండేళ్ల తర్వాత అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై చిత్ర యూనిట్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించారు. అఖిల్ తన మాట మీద నిలబడి పెద్ద హిట్ ఇచ్చారా? అనుకున్నట్టే ఈ సినిమా ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందా లేదా? తెలుసుకుందాం.
కథ: రిక్కీ (అఖిల్) చాలా ప్యాషన్ తో నిండి ఉన్న ఒక రకమైన క్రూరత్వం ఆపాదించుకున్న ఒక యువకుడు. ఒక సంఘటన కారణంగా చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు రిక్కీ. మహదేవ్ (మమ్ముట్టి) రిక్కీ తన శిష్యుడిగా ఎంచుకుని రోగ్ గా మారిన ఒక మాజీ ఏజెంట్ డెవిల్ (డినో మోరియా) ను పట్టుకునే మిషన్ అప్పగిస్తాడు. డెవిల్ తలపెట్టిన ఒక మిషన్ రిక్కీ వల్ల విఫలం కావడంతో రిక్కీనే డెవిల్ యొక్క టార్గెట్ గా మారతాడు. రిక్కీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు, తన దేశానికి ఎలా సేవ చేస్తాడు అనేదే మిగతా కథ.
విశ్లేషణ: ఏజెంట్ ప్లాట్ లైన్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు అఖిల్ క్యారెక్టరైజేషన్ ని ఫుల్ ఎనర్జీతో ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. అఖిల్ పాత్ర ఊహించలేని పనులు చేసే విధానాన్ని చాలా స్టైలిష్ గా చూపించారు. కానీ సరైన స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఒక స్పై థ్రిల్లర్ కు ట్విస్ట్ లు, స్ట్రాంగ్ విలన్ కావాలి. ఏజెంట్ లో అవే లోపించాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సన్నివేశాలు అన్నీ చాలా ఊహాజనితంగా, కొన్ని సన్నివేశాలు పూర్తిగా అసంబద్ధంగా ఉండి కథనాన్ని చాలా ఊహాజనితంగా రూపొందించినట్లు అయింది. ఇక పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ లు కాగా, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే లవ్ ట్రాక్ కూడా అలాగే ఉండింది. నిర్మాణ విలువలు కూడా ఇంత బడ్జెట్, గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాకు సరిపోలేదనే చెప్పాలి. అఖిల్ చాలా బాగా నటించారు, తనతో పాటుగా లెజెండరీ నటుడు మమ్ముట్టి మినహా, సినిమాలోని అన్ని అంశాలు చాలా పెద్ద స్థాయిలో విఫలమయ్యాయి. ఇక సినిమాలో చాలా బోరింగ్ ట్రాక్ గా మారిన లవ్ ట్రాక్ లో ఉండటం వల్ల సాక్షి వైద్య పాత్ర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.
ప్లస్ పాయింట్స్:
- అఖిల్, మమ్ముట్టి నటన
- ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం
- పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సెకండ్ హాఫ్
- బలహీనమైన విలన్ క్యారెక్టరైజేషన్
- పేలవమైన విజువల్స్
తీర్పు: పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఏజెంట్ సినిమా ప్రేక్షకులను తన ప్రధాన లక్ష్యం వైపు ఆకర్షించడంలో విఫలం అయ్యే విధంగా దెబ్బ కొట్టింది. ఫారిన్ లొకేషన్స్ మరియు ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్స్ ల పై పెట్టిన శ్రమ ను ఉపయోగించి మంచి క్యారెక్టరైజేషన్ తో ఎంగేజింగ్ ప్లాట్ ను క్రియేట్ చేసి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా తయారయ్యేది.