Homeసినిమా వార్తలుIcon: అల్లు అర్జున్ నిష్క్రమణ తర్వాత, ఇప్పుడు నానితో ఐకాన్ ప్లాన్ చేస్తున్నారా?

Icon: అల్లు అర్జున్ నిష్క్రమణ తర్వాత, ఇప్పుడు నానితో ఐకాన్ ప్లాన్ చేస్తున్నారా?

- Advertisement -

వేణు శ్రీరామ్ యొక్క ఐకాన్ సినిమా దాదాపు రెండు సంవత్సరాలుగా పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచింది. మొదట ఈ సినిమాకి అల్లు అర్జున్ ను అనుకున్నారు. అప్పట్లో ఈ సినిమాకి.బాగా ప్రచారం చేసిన అల్లు అర్జున్ ఈ సినిమా టైటిల్ నించే తన ‘ఐకాన్ స్టార్’ టైటిల్‌ను కూడా పెట్టుకున్నారు. అలాగే అనేక సందర్భాల్లో ఐకాన్ వ్రాసిన టోపీని ధరించి కనిపించారు. అయితే ‘పుష్ప’ తర్వాత బన్నీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో వేణు శ్రీరామ్ డైలమాలో పడ్డారు.

అల్లు అర్జున్ మొదట ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరియు ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్న వేణు శ్రీరామ్ దీని గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ నుండి బన్నీ హఠాత్తుగా నిష్క్రమించడం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రోడ్‌బ్లాక్ అయ్యింది. బన్నీ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ ని కూడా హీరోగా వేణు శ్రీరామ్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా అందుతున్న అంతర్గత నివేదికల ప్రకారం, నేచురల్ స్టార్ నానిని ఐకాన్ సినిమా కోసం అనుకుంటున్నారట. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎంసీఏ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని పరిశీలిస్తున్నారని సమాచారం.

READ  Dasara: దసరా సినిమా నుండి కొత్త మాస్ లుక్‌ను రివీల్ చేసిన నాని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్

ఐకాన్‌ సినిమాను భారీ స్థాయిలో నిర్మించే ప్రయత్నం చేస్తున్న దిల్ రాజు స్క్రిప్ట్ వర్క్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ చాలా ఎమోషనల్‌గా ఉందని, హృదయాలను హత్తుకునేలా ఉందని దిల్ రాజు గతంలో అన్నారు. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇలాంటి సబ్జెక్ట్ రావడం గర్వించదగ్గ విషయమని కూడా అన్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories