ఆదిపురుష్ టీజర్ లిరికల్ మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం శనివారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో సినిమాలోని ప్రభాస్ సిల్హౌట్ ను చూపించగా, చివర్లో ప్రభాస్ రాముడిగా మెరుస్తూ కనిపిస్తారు. బ్యాక్ గ్రౌండ్ లో జై శ్రీరామ్ అనే పాట ప్లే అవుతుంది. ఈ పాట ఇప్పుడు ఆదిపురుష్ సినిమా చుట్టూ భారీ బజ్ ఏర్పడేలా చేయడంలో సహాయ పడుతోంది.
ఈ పాటలోని రచన మరియు నేపథ్య సంగీతం రోమాలు నిక్కబొడుచుకొనే అనుభూతిని ఇచ్చాయి మరియు మోషన్ పోస్టర్లో ప్రభాస్ కూడా అదిరిపోయారనే చెప్పాలి. ఆదిపురుష్ చిత్ర బృందం ఇప్పుడు ప్రమోషన్స్ లో ప్రతి అంశాన్ని బంగారంగా మార్చి సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ పాటను విడుదల చేశారు. కాగా ఈ పాట శ్రీరాముని శక్తి మరియు విశిష్టత గురించి వివరిస్తుంది మరియు ఏదైనా మంత్రాన్ని జపించడం కంటే ఆ మహానుభావుడి పేరును స్మరించుకోవడం ఎంత ఉత్తమమో వివరిస్తుంది. విడుదలైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నీ సాయం.. సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్య.. మా బలమేదంటే నీపై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే.. మహిమాన్విత మంత్రం నీ నామం.. జైశ్రీరాం.. జైశ్రీరాం..’ అంటూ సాగే ఈ పాటకి సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించగా.. – అతుల్ ఈ పాటను స్వరపరిచారు.
ఆదిపురుష్ సినిమాని 2023 ఎడిషన్ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించిన ఈ చిత్రాన్ని జూన్ 7 నుంచి 18 వరకు న్యూయార్క్ లో జరిగే ఎస్కేప్ ఫ్రమ్ ట్రిబెకా విభాగంలో ప్రదర్శించనున్నారు.