Homeసినిమా వార్తలువరుస సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అయిన త్రిష

వరుస సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అయిన త్రిష

- Advertisement -

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనిపించిన అద్భుతమైన నటీమణులలో త్రిష ఒకరు. ఆమె అందమైన ముఖం మాత్రమే కాదు, అపారమైన నటనా సామర్ధ్యాలు కూడా కలిగి ఉండటం వల్లే అటు తెలుగు ఇటు తమిళ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాజ్యమేలారు. 

అయితే, కొంత కాలంగా ఆమెకు మంచి పాత్రలు రాకపోయినా, తాజాగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా ఆమె దశను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఆమె చేతి నిండా క్రేజీ ఆఫర్లు ఉన్నాయి.

తన కమాండింగ్ పెర్ఫార్మెన్స్ మరియు అద్భుతమైన అందంతో, ఆమె PS-1 లో తన పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసారు. ఈ సినిమాతో చాలా మందికి ఆమె విలువ తెలిసింది. ఈ సినిమాకి ముందు ఆమె తన స్థాయికి తగని కొన్ని చిత్రాలు చాలా చేయాల్సి వచ్చింది.

కానీ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, త్రిష తన పెద్ద చిత్రాల లీగ్‌ లోకి మళ్ళీ తిరిగి వచ్చారు. ప్రస్తుతం తమిళ చిత్రసీమలోని ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్‌ సినిమాలలో ఆమెకు పాత్రలు ఆఫర్ చేయబడ్డాయి.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. త్రిష దళపతి విజయ్ యొక్క 67 వ చిత్రంలో కనిపించబోతున్నారట. ఇక దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో అజిత్ చేసే సినిమాలో కూడా ఆమె కథానాయికగా నటిస్తున్నారని తెలుస్తోంది.

READ  గాలోడు ఓపెనింగ్స్ తో అందరినీ ఆశ్చర్య పరిచిన జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్

ఈ కొత్త ఆఫర్లు త్రిష అభిమానులను ఆనందపరుస్తున్నాయి, ఎందుకంటే ఆమె తన కీర్తిని తిరిగి పొందటం వారికి ఎంతో సంతోషం కదా. సరైన ప్రతిభ ఉంటే కెరీర్ లో మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వటం అంత కష్టమేమీ కాదని త్రిషకు వస్తున్న వరుస ఆఫర్లు నిరూపిస్తున్నాయి.

ఇక అజిత్ – విఘ్నేష్ శివన్ చిత్రం ఆహార అలవాట్లు మరియు రెస్టారెంట్ల నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. కాగా ఈ సినిమాలో అజిత్ తమిళనాడులోని దక్షిణ జిల్లాలకు చెందిన సేంద్రీయ రైతుగా, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరఫరా చేయాలనే లక్ష్యంతో పోరాడే పాత్రలో కనిపించబోతున్నారట.

ఇదిల ఉండగా, త్రిష భారీ చిత్రాలను అందుకోవడమే కాదు, ఆమె తన మొదటి వెబ్ సిరీస్‌కు సంతకం చేసారు, దీనికి ‘బృందా’ అనే పేరు పెట్టారు. సోనీ LIVలో ప్రసారం కానున్న ఈ షోకు సూర్య వంగల దర్శకత్వం వహించనున్నారు. ‘బృంద’ తెలుగు, తమిళ భాషల్లో రూపొంది ఇతర భాషల్లోకి డబ్ అయ్యే అవకాశం ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  విజయ్ వారిసు థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories