Homeసినిమా వార్తలుTrisha: భారీ ధరకు కొత్త ఇల్లు కొన్న నటి త్రిష

Trisha: భారీ ధరకు కొత్త ఇల్లు కొన్న నటి త్రిష

- Advertisement -

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో వెలిగిన నటి త్రిష గత కొన్నేళ్లుగా సరైన సినిమాలు చేయలేదు. అయితే 2022లో విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాతో నటి త్రిష దశ తిరిగింది అనే చెప్పాలి. ఆమె సినీ కెరీర్‌ పొన్నియిన్‌ సెల్వన్‌కు ముందు, ఆ తరువాత అన్నట్లుగా సాగుతోంది.

నాలుగు పదుల వయసులో ఈ బ్యూటీకి మణిరత్నం రూపంలో గొప్ప అదృష్టం తలుపు తట్టింది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో కుందవైగా త్రిష అద్భుతమైన అందంతో చక్కని నటనతో ప్రేక్షకులను మురిపించారు. ఇక పొన్నియిన్‌ సెల్వన్‌కు పార్టు 2 పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కాగా ఇటీవల విడులైన రాంగీ చిత్రంలో కూడా త్రిష తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. హీరోయిన్‌గా అదరగొట్టారు. ప్రస్తుతం తను నటిస్తున్న చతురంగవేట్టై – 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కోసం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం త్రిష రామ్‌ పార్టు –1, ది రోడ్డు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో ఆయన 67వ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ త్రిషను వరించినట్లు తెలుస్తోంది.

READ  Tollywood: బాక్సాఫీస్ వద్ద తమకంటూ ఓ బ్రాండ్ లేదా మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో విఫలమవుతున్న దర్శకులు

అజిత్‌ 62వ చిత్రంలో కూడా ఆమె నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ చిత్రంలో త్రిష నటించడం లేదని తర్వాత తెలిసింది. తాజాగా నటుడు విజయ్‌ ఇంటి సమీపంలో రూ.35 కోట్ల భారీ ధరకు త్రిష ఓ కొత్త ఇంటిని కొన్నట్లు సమాచారం.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న Thalapathy67 చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు ఇది వరకే సమాచారం అందింది. ఇంతకు ముందు విజయ్, త్రిష ఇద్దరూ గిల్లి, తిరుప్పాచి, ఆది, కురువి చిత్రాల్లో కలిసి నటించారు.

కాగా దళపతి 67వ చిత్రంలో విజయ్ 46 ఏళ్ల టీ వ్యాపారి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర విజయ్ పాత చిత్రం భగవతి పోలి ఉంటుందని.. ఇందులో విజయ్ టీ దుకాణదారుడి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Sankranti-2023: 2023 సంక్రాంతికి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయిన దర్శకులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories