Homeసినిమా వార్తలుSamantha: నిర్మాత చిట్టిబాబుకు కౌంటర్ ఇచ్చిన నటి సమంత

Samantha: నిర్మాత చిట్టిబాబుకు కౌంటర్ ఇచ్చిన నటి సమంత

- Advertisement -

నటి సమంత గత కొద్ది రోజులుగా రకరకాల కారణాల వల్ల వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. యశోద లాంటి సినిమా చేసిన తర్వాత ఆమె ఇటీవల శాకుంతలం వంటి పీరియాడిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందించిన శాకుంతలం సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సమంత సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించారు.

శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కించి గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో తన ఆరోగ్యం బాగోలేదంటూ సమంత ఇంటికే పరిమితమైన నేపథ్యంలో ఆమె గురించిన రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. ముఖ్యంగా మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉండే నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు అయితే సమంత పరువు తీసే విధంగా మాట్లాడారు. సమంతకి ముసలి ముఖం వచ్చేసిందని.. పైగా ఆమె శకుంతల ఎంటి అంటూ ఆయన ప్రశ్నించారు.

అంతే కాదు జబ్బు లేక పోయినా ఉన్నట్లుగా నాటకాలు ఆడుతోందని సింపతితో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకుంటుందని అందుకే ఆమె ఎప్పటికప్పుడు తన అనారోగ్యం గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది అంటూ చిట్టి బాబు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఈ విషయం సమంత వరకు చేరినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలా కౌంటర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఆయనకు చెవుల నుంచి వచ్చిన జుట్టు వ్యవహారాన్ని ఉదహరిస్తూ ఆమె సెటైర్ వేశారు.

READ  Shaakuntalam: ప్రీమియర్స్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసిన శాకుంతలం టీం

జనాలకు చెవుల్లో నుంచి కూడా జుట్టు ఎందుకు బయటకు వస్తుందంటూ గూగుల్లో సెర్చ్ చేస్తే డాక్టర్లు టెస్టిరోన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అలా జుట్టు బయటకు వస్తుందని భావిస్తున్నారని ఆమె అన్నారు. చిట్టిబాబు వ్యాఖ్యలకు సమంత చెప్పుతో కొట్టినట్టు కౌంటర్ ఇచ్చారని కొందరు నెటిజన్లు ఆమెని సమర్ధించగా.. కొందరు మాత్రం ఆమె.వ్యాఖ్యల పట్ల సంతోషంగా లేరనే చెప్పాలి. సమంత ఒక స్థాయి హుందాతనాన్ని పాటించాల్సిందని, బాడీ షేమింగ్ చేయడం సరికాదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Shaakuntalam: సమంత 'శాకుంతలం' పై వచ్చిన పుకార్లను ఖండించిన గుణశేఖర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories