పుష్ప: ది రైజ్, వారిసు, డియర్ కామ్రేడ్ మరియు గుడ్‌బై వంటి పలు చిత్రాలలో తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న రష్మిక మందన్న తాజాగా శాంతరూబన్ దర్శకత్వంలో రెయిన్‌బో అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్న ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశంగా చెప్పుకోవచ్చు.
సోమవారం, రష్మిక మందన్న తన రాబోయే చిత్రం రెయిన్‌బో యొక్క పోస్టర్‌ను షేర్ చేసి, “ రెయిన్‌బో ది డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైఫ్. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. మీ అందరి ఆశీస్సులు మరియు ప్రేమ నాకు ఉన్నాయని ఆశిస్తున్నాను. మరియు ఇది మీకు నా నుంచి తదుపరి ఇష్టమైన పాత్ర కావాలని నేను నిజంగా ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల అనంతరం రెయిన్‌బో చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. రష్మిక మందన పింక్ దుస్తులలో అందంగా కనిపించగా.. మరియు నటుడు దేవ్ మోహన్ పూజా వేడుకలో సాంప్రదాయ పసుపు కుర్తాలో సింపుల్‌గా కనిపించారు. ఈ చిత్రానికి మొదటి క్లాప్‌ని అమల అక్కినేని అందించారు మరియు తారాగణం ఏప్రిల్ 7, 2023 న సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు.
రెయిన్‌బో చిత్రం ఇక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కబోతుంది. మరియు డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు దేవ్ మోహన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ గొప్ప అవకాశాన్ని రష్మిక ఉపయోగించుకోవాలని మరియు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుందాం.
ఇదిలా ఉంటే, తదుపరి రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న యానిమల్‌లో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 11, 2023న థియేటర్లలోకి రావడానికి షెడ్యూల్ చేయబడింది. కాగా ప్రేక్షకులలో చాలా అంచనాలు ఉన్న సీక్వెల్ పుష్ప: ది రూల్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన కూడా రష్మిక కనిపిస్తున్నారు.