సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి మామూలే. హీరో హీరోయిన్లులు తెర పైనే కాకుండా నిజ జీవితంలో పెళ్లి చేరుకుని జంటలుగా మారతారు. వారి అభిమానులు కూడా అందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆయా జంటలు విడిపోవడం కూడా పలు మార్లు జరిగింది. అలాంటి వార్త విన్నప్పుడు ఆయా నటీనటుల అభిమానులు బాధ పడటం సహజం.
యువ జంటలు కాకుండా పెళ్లి చేసుకుని పదేళ్లు, ఇరవై ఏళ్ళు కలిసి కాపురం చేసిన జంటలు కూడా విడాకులు తీసుకుంటున్నారు. తాము ఎంతగానో అభిమానించే స్టార్స్ వీడాకులు తీసుకోవడంతో.. అభిమానులు చాలా బాధ పడుతున్నారు. తాజాగా ఈ విడాకులు తీసుకునే వారిలో మరో ప్రముఖ నటి కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చాలామంది సినీ తారలు విడాకులు తీసుకుని ప్రేక్షకులకి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ ప్రియమణి తన భర్త ముస్తాఫా కు విడాకులు ఇవ్వబోతున్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేయగా.. అలాంటిదేమీ లేదని లోగడ ప్రియమణి స్పష్టం చేశారు. ఆధారాలు లేని వార్తలు అని ఖండించారు కూడా.
అయితే తాజాగా ప్రియమణి – ముస్తాఫా దంపతుల విడాకుల వార్తలు మరోసారి తెరమీదకి వచ్చాయి. వీరిద్దరికీ పెళ్లై చాలా కాలం అవుతున్నా వీరికి పిల్లలు లేరు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని ప్రియమణి ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారట. కెరీర్ లో బాగా సెటిల్ అయ్యాకే పిల్లల్ని కనాలి అని ఆమె భావిస్తున్నారట.. ఈ కారణంగానే వీళ్ల మధ్య గొడవలు అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ప్రియమణి లేదా అవిడ భర్త ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు.
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ప్రియమణిది ప్రత్యేకమైన స్థానంగా చెప్పుకోవచ్చు. అటు అగ్ర హీరోలు, ఇటు యువ హీరోలతో నటించి నటనతో పాటు గ్లామర్ గాళ్ గా కూడా రాణించారు. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరుణంలో ముస్తఫా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడారు ప్రియమణి.అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ముస్తఫాకు ఇంతకు ముందే పెళ్ళి అయ్యింది. కానీ,ముస్తఫా ప్రియమణి ప ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.