సీనియర్ నటి మీనా ఇటీవల భర్తను కోల్పోయిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 అనంతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆవిడ భర్త ఇటీవల మరణించారు. ఆమె భర్త వయసు దాదాపు 50 ఏళ్లు మాత్రమే కావడంతో ఆమె అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని అందరికీనకోరా ఈ వార్త కలచి వేసింది.
ఈ 46 ఏళ్ల నటిని ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని తన కుటుంబం ఒత్తిడి చేస్తోందట. మీనా గత కొంతకాలంగా సినిమా షూటింగ్‌లకు హాజరవుతున్నారు. ఆమె పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు కానీ మీనా పెళ్లి చేసుకుంటున్నారని ఆమె సన్నిహితులు ద్వారా సమాచారం వినిపిస్తుంది.
మీనా తన కుటుంబ స్నేహితుల్లో ఒకరిని పెళ్లి చేసుకోనున్నారనే పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి. ఇక తాజాగా వినిపిస్తున్న ప్రకారం, ఆమెకు కాబోయే ఆమె దివంగత భర్తకు కూడా సన్నిహితుడేనట.
మీనాకు 2009లో విద్యాసాగర్‌తో వివాహమైంది. మీనా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. అయితే అనారోగ్యంతో ఈ ఏడాది జూన్ 18న తుదిశ్వాస విడిచారు. భర్త చనిపోవడంతో ధైర్యం కోల్పోయిన మీనా రెండో పెళ్లితో తన జీవితంలో వెలుగులు నింపాలని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. మీనా ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట.
నిజానికి రెండో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని మీనా తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే మీనాకు భర్త అవసరం లేకపోయినా కూతురికి తండ్రి కావాలి కాబట్టి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు మీనాను అభ్యర్థిస్తున్నారట.
అయితే, పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం, ఆమె కుమార్తెతో నివసిస్తున్నారు. ఆవిడ కుమార్తె తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో థెరి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. భర్త మరణించిన తర్వాత మహిళలు మళ్లీ పెళ్లి చేసుకోవడం స్వాగతించదగిన విషయం, మీనా వివాహ ప్రయాణాన్ని అత్యద్భుతమైన రంగులతో పునఃప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము.