నటి ఇలియానా డిక్రూజ్ మంగళవారం సోషల్ మీడియా ద్వారా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ నటి తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే ఇలియానా తన బిడ్డ తండ్రి ఐడెంటిటీని గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది.
ఈ విషయాన్ని నటి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసారు. ‘మామా’ అనే అక్షరాలతో ఉన్న మోనోక్రోమ్ ఫొటోను, పర్సనలైజ్డ్ పెండెంట్ ను ఆమె షేర్ చేశారు. ఇలియానా పోస్ట్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేయగా, నెటిజన్లు ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఆశ్చర్యపోతున్నారు.
కొందరు నెటిజన్లు ఆమెని తన బిడ్డ తండ్రి వివరాలను పంచుకోవాలని కోరగా, మిగతా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలియానా డిక్రూజ్ కొన్నేళ్ల క్రితం ఆండ్రూ నీ బోన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారిద్దరూ వివాహం చేసుకున్నారా లేదా అనేది ఇంకా అస్పష్టంగా ఉన్న సమయంలో నటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అతనిని “ఉత్తమ భర్త” అని ప్రస్తావించటం కూడా జరిగింది.
ఇక తాజాగా సింగర్, ర్యాపర్ బాద్షాతో కలిసి ఇలియానా ఇటీవల ‘సబ్ గజాబ్’ అనే ప్రైవేట్ వీడియో సాంగ్ చేసింది. ఈ వీడియోలో ఇలియానా బాద్ షాతో కలిసి స్టైల్ తో డ్యాన్స్ చేయగా, వీరిద్దరి కెమిస్ట్రీ పై ఇంటర్నెట్ ప్రశంసల జల్లు కురిపిస్తోంది.