తనకి నరేష్ మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటూ వీడియో విడుదల చేసింది నటి పవిత్రా లోకేష్.గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్రా లోకేష్ కు పెళ్ళి జరిగింది అని..కాదు సహాజీవనం అని రకరకాలుగా వదంతులు వ్యాపించాయి. ఆ విషయంపై నరేష్ మరియు పవిత్రా లోకేష్ ఇరువురూ వీడియోల ద్వారా వివరణ ఇచ్చారు.
ఈ మేరకు పవిత్రా లోకేష్ మాట్లాడుతూ నరేష్ భార్యకి నిజంగా భర్త కావాలంటే ఇక్కడ హైదరాబాద్‌లో అడిగితే న్యాయం జరుగుతుంది కానీ ఏ సంబంధం లేని బెంగుళూరు వెళ్లి మీడియా ముందు రచ్చ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉందని,ఇదంతా తన పేరు చెడ గొట్టడానికిచేస్తుందంటూ తనపై ఆరోపణల్ని ఖండించారు పవిత్రా లోకేష్.
తాను కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుండో చాలా ఏళ్లుగా పని చేస్తున్నానని, ప్రేక్షకులకి ఎంతో దగ్గరయ్యాను అందుకే తన సమస్యను చెప్పుకోవడానికి ఇలా మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.నరేష్ గారికి తనకు ఉన్న సంబంధం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని.. అలాగే నరేష్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అవసరం కూడా లేదని,నరేష్ గారి భార్యను అంటూ వచ్చిన రమ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆవిడ భాధ పడ్డారు. దయచేసి ఈ విషయంలో తనను,నరేష్ గారిని మద్దతు పలకాలని ఆవిడ అభ్యర్ధించారు.
ఇదే విషయం పై నరేష్ మాట్లాడుతూ తన మాజీ భార్య,మూడో భార్య అయిన రమ్య పై విరుచుకుపడ్డారు. ఆమె డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన కుటుంబాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు.హిందూపూర్ లో ఆమె ఎన్నో ఆర్థిక మోసాలకు పాల్పడిందని, అంతటితో ఆగకుండా హైదరాబాద్ లో కూడా చాలా మోసాలు చేసి కేసుల పాలయిందని, మళ్ళీ బెంగళూరు వచ్చి ఒక బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలిసి తన మీద వదంతులు వ్యాపింపజేస్తుంది అని అన్నారు.
అసలు ఆమెకు తనకి ఎనిమిదేళ్ళ క్రితం విడాకులు తీసుకున్నానని,ఇప్పుడు ఈ అసత్య ఆరోపణలతో ఆగకుండా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ కూడా చేసిందని..ఆమెకు పది లక్షలు ఇవ్వగా, అవి తీసుకుని పెద్ద వాళ్ళ దగ్గరకి వెళ్లి మరో యాభై లక్షలు పీడించి అనేక రకాలుగా గొడవ చేసిందని తెలిపారు. నేను ఆమెకు డైవర్స్ పేపర్స్ పంపించాను. అవి పంపి నెల అవుతుంది. డైవర్స్ పేపర్స్ పంపిన తరువాత నుంచి నాకు పెళ్లైందని.. పెళ్లి కాబోతుందని నాపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని నరేష్ వాపోయార.
రమ్య కర్ణాటక వెళ్లి అక్కడ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతుందనీ.. అందుకే తాను కర్ణాటక వెళ్లి అన్ని నిజాలను బయటపెట్టగా కర్ణాటక ప్రజలు కూడా ఈ విషయంలో తనకు సపోర్ట్ చేశారని.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ ఛానల్స్‌లో రచ్చ మొదలుపెట్టిందని ఆయన చేప్తూ 8 ఏళ్లుగా ఆయన పడ్డ హింస.. జరిగిన బ్లాక్ మెయిల్ వల్లే విడాకులు తీసుకుంటున్నానని చెప్పారు.
ఈ విషయంలో అసలు సంబంధం లేని పవిత్రా లోకేష్ ను ఇందులోకి లాగి ఆమెను విడాకులకు కారణంగా చూపించడం చాలా తప్పు అని నరేష్ చెప్పారు.తమ స్నేహం,బంధం తమది అని,తాము ఆ విషయంలో ఎప్పుడూ ముక్కుసూటిగా ఉంటాం అని నరేష్ తెలిపారు.తప్పు చేస్తేనే భయపడాలి కానీ తామేమీ తప్పు చేయలేదని, అన్ని ఆధారాలతో మళ్ళీ మీడియా ముందుకు వస్తానని చెప్తూ..మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి అంటూ చేతులు జోడించి మరీ ప్రాధేయపడ్డారు నరేష్.