నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ అఖండ 2. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు మూడు కూడా ఎంతో పెద్ద విజయం అందుకుని వీరి కాంబినేషన్ కి పెద్ద క్రేజ్ తీసుకువచ్చాయి.
దానితో అఖండ 2 పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా 14 రీల్స్ ప్లస్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నెగటివ్ క్యారెక్టర్ చేయనున్నారట యువ నటుడు ఆది పినిశెట్టి.
గతంలో బోయపాటి అల్లు అర్జున్ హీరోగా తీసిన సరైనోడులో ఆయన విలన్ గా నటించారు. అలానే నటుడిగా అన్ని వర్గాలలో మంచి క్రేజ్ ఉంది ఆదికి. ఇక అఖండ పార్ట్ 1 ని మించేలా ఈ మూవీ రూపొందుతుండగా ఇందులో బాలకృష్ణ అఘోర పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుందట.
మొత్తంగా మరొక్కసారి బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ కూడా ఈ మూవీతో మరింత భారీ క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ చివర్లో అఖండ 2 ఆడియన్స్ ముందుకి రానుంది.