Homeసినిమా వార్తలుPushpa: పుష్ప రష్యా రిలీజ్ వల్ల నిర్మాతలకు 3 కోట్ల నష్టం

Pushpa: పుష్ప రష్యా రిలీజ్ వల్ల నిర్మాతలకు 3 కోట్ల నష్టం

- Advertisement -

అల్లు అర్జున్ నటించిన మరియు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్ డిసెంబర్ 8న రష్యన్ సినిమా థియేటర్లలో ప్రీమియర్ షోల ద్వారా ప్రదర్శించబడింది. జపాన్‌లో RRR మాదిరిగానే ఈ చిత్రం కూడా రష్యాలో మంచి కలెక్షన్లను రాబడుతుందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు పుష్ప పార్ట్ 1 చిత్ర బృందం మొత్తం సినిమా ప్రచారం కోసం ఆ దేశానికి వెళ్లారు. వీరికి తోడుగా హీరోయిన్ రష్మిక మందన్న కూడా వెళ్ళారు.

చిత్ర బృందం సభ్యులంతా రష్యాకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా సినిమా కోసం ప్రమోషన్లు చేశారు. టీవీ ఇంటర్వ్యూలు, రేడియో ఇంటర్వ్యూలు మరియు మరిన్ని ప్రచార కార్యక్రమాలు కూడా జరిపారు.

దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, మరియు హీరోయిన్ రష్మిక మందన్న మరియు మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్ కూడా రష్యాకు బయలుదేరారు, ఇవన్నీ కలిసి విడుదలకు ముందు అందరిలోనూ కొంత ఆసక్తిని కలిగించింది మరియు ఒకింత అంచనాను కూడా సృష్టించింది.

అయితే పుష్ప టీమ్ తమ సినిమాను వీలయినంత ప్రచారం చేసినప్పటికీ.. రష్యా ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేనట్లు కనిపిస్తుంది.

READ  శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్న విజయ్ దేవరకొండ

కాగా రష్యాలో పుష్ప ప్రమోషన్స్ మరియు డబ్బింగ్ కోసం నిర్మాతలు 3 కోట్లు ఖర్చు చేసారు మరియు అందుకు ప్రతిఫలంగా నిర్మాతలకు రాబడి ఏమీ రాకపోగా ఖర్చుపెట్టిన మొత్తం కూడా వారికి నష్టంగా దాపురించింది.

ఇక రష్యాలో వచ్చిన తక్కువ నంబర్ల కారణంగా అక్కడ సినిమాను మొదటి మూడు రోజుల్లోనే థియేటర్ల నుండి తీసివేసినట్లు సమాచారం.

అయితే విడుదలకు ముందు ప్రమోషన్స్‌తో ముందుకు సాగిన పుష్ప యూనిట్.. ఇప్పుడు రష్యాలో పుష్ప బాక్సాఫీస్ కలెక్షన్స్ దారుణంగా ఉండడంతో సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే విడుదలైన రెండు వారాల తర్వాత కూడా, రష్యాలో ఈ చిత్రానికి లభించిన ఆదరణ మరియు ప్రతిస్పందన గురించి టీమ్ నుండి ఎటువంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. ఇది చూస్తుంటే పుష్ప రష్యాలో ఘోర పరాజయం పొందింది అనే భావన అందరిలోనూ కలుగుతోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  నన్ను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేయలేదని చెప్పిన రష్మిక మందన్న


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories