Homeసినిమా వార్తలు2022 Recap: తెలుగు టైర్-2 హీరోలకు దారుణమైన సంవత్సరంగా నిలిచిన 2022

2022 Recap: తెలుగు టైర్-2 హీరోలకు దారుణమైన సంవత్సరంగా నిలిచిన 2022

- Advertisement -

ఇంతకు ముందు మనం తెలుగు టాప్ 6 హీరోలకు 2022 సంవత్సరం ఎలా గడిచిందో రీక్యాప్ చేసాము. ఇప్పుడు తెలుగు టైర్-2 హీరోలకు ఈ సంవత్సరం ఎలా గడిచిందో చూద్దాం.నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, రామ్, నితిన్, వరుణ్ తేజ్ లాంటి హీరోలందరూ ఈ ఏడాది రాణించలేకపోయారు.

ఈ ఏడాది టైర్-2 హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. కాగా ఆ సినిమాల ఫలితాల వల్ల తమ రెమ్యునరేషన్‌లను కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ జూన్ లో అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాని. ఈ చిత్రంలో చక్కని వినోదం, అహ్లాదమైన సంగీతంతో పాటు ప్రత్యేకమైన కథనం కూడా తోడైంది. నాని, నజ్రియా మరియు ఇతర ఆర్టిస్టుల నటనకు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే, ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఎక్కువ మంది ప్రజలకు చేరువ కాలేకపోయింది మరియు ఓవర్సీస్ మినహా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

నాని ఇప్పుడు తన తదుపరి చిత్రం దసరా పైనే తన అన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం పీరియడ్ బ్యాక్‌డ్రాప్ మరియు భారీ స్టార్ తారాగణంతో తెరకెక్కనుంది. మరియు గ్రామీణ వాతావరణంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిల్లో విడుదల కానుంది.

ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ ఏడాది లైగర్ చిత్రాన్ని విడుదల చేశారు. కాగా విజయ్ దేవరకొండ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి ఈ చిత్రానికి భారీ ప్రమోషన్స్ చేసారు. అయితే సినిమా భారీ డిజాస్టర్‌గా మారడంతో ఆయన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.

READ  హిట్-2 చిత్ర బృందానికి మంచి సలహా ఇచ్చిన రాజమౌళి

అది చాలదన్నట్లు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సినిమాకు పెట్టిన అక్రమ పెట్టుబడులకు సంబంధించి ఈడీ శాఖతో ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2022 విజయ్ దేవరకొండకు భయంకరమైన మరియు మరిచిపోలేని సంవత్సరంగా నిలిచింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బహుభాషా చిత్రం ది వారియర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెగ్యులర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఖచ్చితమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ అయ్యేందుకు అన్ని అంశాలు ఉన్నాయి. కానీ దర్శకుడు లింగుస్వామి వాటిని సరైన రీతిలో ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యారు. తద్వారా ది వారియర్‌ సినిమా వైఫల్యం చెందింది.

నాగ చైతన్య ఈ ఏడాది బంగార్రాజు వంటి డీసెంట్ హిట్‌తో ప్రారంభించారు. అయితే ఇది పూర్తిగా ఆయన సినిమా కాదు, మరో హీరోగా నాగార్జున కూడా కనిపించారు. ఇక ఈ ఏడాది నాగ చైతన్య థాంక్యూ అనే మరో సినిమా రిలీజ్ చేయగా ఆ సినిమా రెండో రోజు నుంచి మినిమమ్ కలెక్షన్స్ రాబట్టలేక భారీ డిజాస్టర్ గా నిలిచింది.

వరుణ్ తేజ్ కూడా ఈ సంవత్సరం గనితో భారీ వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు, ఆ పైన ఆయన నటించిన మల్టీ స్టారర్ అయిన చిత్రం F3 కూడా పూర్తిగా హిట్ కాలేదు మరియు బాక్సాఫీస్ వద్ద ఎబొవ్ యావరేజ్ గా ముగిసింది. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

READ  మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ దిశగా వెళ్తున్న హిట్-2

ఓవరాల్‌గా, 2022 సంవత్సరం టైర్2 హీరోలలో అందరికీ దారుణమైన సంవత్సరంగా నిలిచింది. అయితే వారు వచ్చే ఏడాది తాము చేస్తున్న చిత్రాలతో తిరిగి పుంజుకోగలమని ఆశిస్తున్నారు. మరి వారందరికీ శుభాకాంక్షలు తెలుపుదాం.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories