Homeసినిమా వార్తలుసూపర్ స్టార్ అభిమానిగా కనిపించనున్న యువ సామ్రాట్

సూపర్ స్టార్ అభిమానిగా కనిపించనున్న యువ సామ్రాట్

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న కొత్త సినిమా థాంక్యూ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య జంటగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మజిలీ చిత్రం నుండి బంగార్రాజు వరకు నాగ చైతన్య సినిమాలన్నీ వరుసగా హిట్స్ అవడం విశేషం.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఇది వరకే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇందులో నాగ చైతన్య పాత్ర.. స్కూల్ రోజులు, కాలేజీ రోజులు ఆ పైన ఒక స్టార్టప్ కంపెనీ యజమానిగా ఎదిగే క్రమంలో ఎలాంటి పరిస్తితులు ఎదురుకున్నాడు? వాటి వల్ల తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకున్నాడు అనే అంశాలు స్పృశించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమాలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నారట. హీరో కాలేజీ రోజుల్లో మహేష్ అభిమానిగా చూపిస్తారని, హీరో జీవితంలో ఒక్కో కాలమానంలో ఒక్కో సినిమాని చూపిస్తూ..తద్వారా ఆయా దశలలో హీరో ప్రయాణంలో ఆయా సినిమాలను చూపించే ప్రయత్నం చేశామని నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

READ  ది వారియర్ కు సీక్వెల్ ఉంటుంది అన్న దర్శకుడు లింగుస్వామి

తెలుగు సినిమాల్లో ఇలా హీరోలకు హీరోలే అభిమానులుగా ఉండటం కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను.. వారి డైలాగులను చాలా సినిమాల్లో ఇది వరకు చాలా సినిమాల్లో చుసాం. మరి థాంక్యూ చిత్రంలో మహేష్ బాబు అభిమానిగా నాగ చైతన్య ఎలా అలరిస్తాడో చూడాలి.

థాంక్యూ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా, కొన్ని కారణాల వల్ల విడుదల విషయంలో కాస్త జాప్యం జరిగింది. మొత్తానికి ఈ సినిమాని జూలై 22, 2022 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాలవికా నాయర్, అవికా గోర్‌లు హీరోయిన్లుగా నటించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  మహానటి పాత్రలో అనసూయ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories