Homeసినిమా వార్తలువిక్రమ్ ఖాతాలో మరో రికార్డు: ఓటీటీ లోనూ ఇరగదీస్తున్న సినిమా

విక్రమ్ ఖాతాలో మరో రికార్డు: ఓటీటీ లోనూ ఇరగదీస్తున్న సినిమా

- Advertisement -

లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్‌లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలకు పైగా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం గత వారం ఓటీటీలో విడుదల అయింది.

ధియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా.. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ నిలిచిన విక్రమ్.. తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద కమల్ హాసన్ స్టామినా ఇంకా తగ్గలేదని నిర్ధారణ అయిందని చెప్పవచ్చు.

ఇకపోతే ‘విక్రమ్’ సినిమా జులై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోనూ తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ వ్యూయర్ షిప్ సాధించి ఓటీటీలో సరికొత్త రికార్డ్ సృష్టించడం విశేషం.

READ  ప్రేక్షకులదే తప్పు అంటున్న నాని

డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండేలా వెసులుబాటు కలిగించారు డిస్నీ + హాట్ స్టార్ వారు. స్ట్రీమింగ్ కాబడిన ఐదు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. రికార్డ్ స్థాయి వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది విక్రమ్.

ఈ సందర్భంగా హీరో కమల్ హాసన్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ మీడియాతో ముచ్చటించారు. ప్రేక్షకులు అందించిన ఈ అపూర్వ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కమల్ హాసన్ తెలిపారు. థియేటర్స్ లో కలెక్షన్స్ తో పాటు ఇప్పుడు ఓటీటీలో కూడా హయ్యెస్ట్ వ్యూయర్షిప్ సాధించడం ఆనందంగా ఉందని కమల్ చెప్పారు.

ఇక గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ తమ ఓటీటీ సంస్థలో ‘విక్రమ్ ‘ సాధిస్తున్న రికార్డుల పట్ల చాలా సంతోషంగా ఉన్నామని, ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్ షిప్ లో రికార్డులు క్రియేట్ చేసిన విక్రమ్ దేశవ్యాప్తంగా కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్ ను అందించిందని, ఇంత గొప్ప సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Ponniyan Selvan Teaser: మణిరత్నం తెరకెక్కించిన మరో అద్భుతం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories