Homeసినిమా వార్తలురెమ్యునరేషన్ వద్దు.. లాభాలే ముద్దు అంటున్న అఖిల్

రెమ్యునరేషన్ వద్దు.. లాభాలే ముద్దు అంటున్న అఖిల్

- Advertisement -

భారీ అంచనాల మధ్య హీరోగా తెరంగేట్రం చేసిన అక్కినేని వారసుడు అఖిల్ తొలి మూడు చిత్రాల ఫలితాలు ఆయనను ఆయన అభిమానులను నిరాశ పరిచాయి. అయితే గతేడాది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో మొదటి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నారు హీరో అఖిల్‌.ఇక ఇప్పుడు ఏజెంట్‌ గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి ఈ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ సినిమా విడుదల కానుంది.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం తాలూకు టీజర్‌ను చూస్తుంటే సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్సులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండి ఆకట్టుకోగా, ఇక అఖిల్‌ ఆహార్యం, ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపేలా ఉన్నాయి టీజర్ లో. ఈ సినిమాకు తమిళ పరిశ్రమకి చెందిన సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్మాత అనిల్ సుంకర తెలియజేశారు. ఈ సినిమాకి హీరో అఖిల్ మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి రెమ్యునరేషన్ ఏమీ తీసుకోకుండా సినిమా లాభాల్లో భాగం తీసుకోనున్నారు అని మొదటి నుంచీ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర ధృవీకరించారు అని తెలుస్తుంది.

READ  ప్రేక్షకులదే తప్పు అంటున్న నాని

ఇది నిజంగా ఏజెంట్ టీమ్ చేసిన మంచి పనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల్లో దాదాపు అరవై శాతం బడ్జెట్ రెమ్యునరేషన్ లకే పోతుంది. ఇలాంటి సమయంలో ఇలా సినిమా లాభాల్లో భాగం తీసుకుంటే మిగతా డబ్బు సినిమా బడ్జెట్ కు కేటాయించవచ్చు. మరి ఏజెంట్ సినిమా టీమ్ తీసుకున్న నిర్ణయం ఫలించి సినిమా సూపర్ హిట్ అయి అటు అఖిల్ కు ఇటు దర్శకుడు సురేందర్ రెడ్డికి లాభాలు అందించాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  పవిత్ర లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ భర్త


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories