Homeసినిమా వార్తలురెండు ఓటీటీ యాప్ లలో విడుదల కానున్న F3

రెండు ఓటీటీ యాప్ లలో విడుదల కానున్న F3

- Advertisement -

ఒకప్పుడు థియేటర్లలో సినిమా ఆడిన తరువాత కొన్ని నెలల తరువాత కానీ టీవీలలో వచ్చేవి కావు. కొన్ని సినిమాలు అయితే దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ ఉండేవి. అయితే రోజులు మారాయి .. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన రోజే ఆ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుంది? ఏ యాప్ లో వస్తుంది అన్న వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.ఫలానా రోజున ఓటిటి లో విడుదల అవుతుందని తెలిస్తే.. ఒక వర్గం ప్రేక్షకులు ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదు.

తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్‌‌ల ‘F3’ సినిమా విడుదలైన 50 రోజులు కావొస్తోన్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన చేసారు.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి, దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. అదే నటీనటులతో రీబూట్ కాన్సెప్ట్‌తో ఎఫ్ 3 సినిమాని తెరకెక్కించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు టాక్ కాస్త తేడాగా వచ్చినా, కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పటికే విడుదలై 50 రోజుల దాటుతున్న ఈ సినిమా ఓటీటీలో ఎపుడు వస్తుందా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న దశలో, తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ‌ను ప్రకటించారు.

అయితే డబుల్ థియేటర్లలో విడుదల చేసిన తరహాలో F3 సినిమా రెండు ఓటీటీ యాప్ లలో విడుదల అవుతుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుండగా, మరోప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. జూలై 22 నుంచి ఎఫ్ 3 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

READ  ఓటిటిలో సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్
https://twitter.com/Netflix_INSouth/status/1546866731322261507?t=7FaUgiySDzhBS8HyS8nL9g&s=19

ట్రిపుల్ ఫన్ ఫ్రస్టేషన్‏ను ఇప్పుడు మీరు మీ కుటుంబసభ్యులతో ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయోచ్చని తెలిపారు చిత్ర యూనిట్ మరియు ఓటీటీ సంస్థ. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా జూలై 22 నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించగా..పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఎట్టకేలకు OTT లో విడుదల అవుతున్న పెళ్ళి సందD


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories