Homeసినిమా వార్తలుప్రేక్షకులతో నాన్నా పులి ఆట ఆడుతున్న దిల్ రాజు

ప్రేక్షకులతో నాన్నా పులి ఆట ఆడుతున్న దిల్ రాజు

- Advertisement -

లాక్ డౌన్ వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు కోట్ల రూపాయల వరకూ నష్టం జరిగింది. అందువల్ల పెరిగిన అప్పుల బాధతో, సినిమాలు మళ్ళీ యధావిధిగా విడుదల అవుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచడం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన రేట్లకు అవసరం అయితే ఎక్కువ రేట్లు అనుమతి తీసుకుని అమలు చేయడం మొదలు పెట్టారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రేక్షకుల పరిస్థితి బాగానే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశ్యం ఏదైనా ఆయన టికెట్ రేట్లను బాగా తగ్గించేయడంతో పరిశ్రమ వర్గాలు మరియు థియేటర్ యాజమాన్యాలు ఒక మోస్తరు రేట్లను అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం పరుస్తితి అలా లేదు.

గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం అవసరమైతే థియేటర్లకు అత్యధిక రేట్లను నిర్ణయించే హక్కులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు సింగిల్ స్క్రీన్ లకు 175/- వరకూ.. మల్టీప్లెక్స్ లకు 295/- వరకూ పెంచుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఐతే సినీ పరిశ్రమ మరియు డిస్త్రీబ్యూటర్లు అత్యాశకు పోయి ఆ రేట్లను ఫిక్స్డ్ రేట్లుగా (fixed rates) పెట్టేసి.. మళ్ళీ వాటి పైన మరో 50 లేదా 100 రూపాయలు పెంచేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ వ్యవహారం భారీ హైప్ తో వచ్చే పాన్ ఇండియా సినిమాలకు సరిపోతుంది కానీ సాధారణ కమర్షియల్ చిత్రాలైన ఆచార్య, సర్కారు వారి పాటకు కలిసి రాలేదు. అలాగే మీడియం బడ్జెట్ సినిమాకు పైన చెప్పుకున్న 175/295 రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు భావించారు. అందుకే ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు.

ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేసి ఓటీటీ బాట పట్టడంతో.. నిర్మాతలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మా సినిమాకు తక్కువ అంటే మా సినిమాకి తక్కువ అంటూ ప్రచారం చేస్తున్నారు. అదైనా న్యాయంగా చేస్తున్నారా అంటే అదీ లేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన “F3” సినిమాకి టికెట్ రేట్లు తగ్గించాము అంటూ ప్రచారం చేసారు. కానీ అలా జరగలేదు.. ఫ్3 సినిమాకి పైన ఉదాహరించిన 175/295 రేట్లు అమలులో ఉన్నాయి. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన “పక్కా కమర్షియల్” కు అయితే టికెట్ రేట్లు దాదాపు 100 నుంచి 150 రూపాయలు తగ్గించాము అని బాగా ప్రచారం చేశారు. తీరా చూస్తే సింగిల్ స్క్రీన్ లకు ఒక 25 రూపాయలు, మల్టిప్లెక్స్ లకు ఒక యాభై రూపాయల వరకు మాత్రమే తగ్గించారు.

READ  NBK-108: ఆ టైటిల్ వద్దు అంటున్న బాలయ్య

ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న.. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న “థాంక్యూ” చిత్రానికి కూడా అదే ప్రచారం జరిపారు. ఈ చిత్రానికి కూడా సింగిల్ స్క్రీన్ లకు 100 (excl GST) రూపాయలు, మల్టీ ప్లెక్స్ లకు 150 (excl GST) ఆని ప్రచారం చేశారు. వాటికి GST యాడ్ చేసినా కూడా 112/175 అవుతాయి. కానీ నిన్ననే ఆన్లైన్ బుకింగ్ లు ప్రారంభించిన “థాంక్యూ” చిత్రానికి మాత్రం బుక్ మై షో లో టికెట్ రేట్లు చూస్తే సింగిల్ స్క్రీన్ కు 150/175, మల్టీ ప్లేక్స్ కు 250 రూపాయలుగా నిర్ధారించినట్టు తెలిసింది. అసలు టికెట్ రేట్లు తగ్గించే ఉద్దేశ్యం లేనప్పుడు ప్రచారం చేయడం, ఇలా ప్రేక్షకులను మోసం చేయడం ఎందుకు? ఈ నాన్నా పులి మల్లె ఆటను దిల్ రాజు ఇకనైనా ఇలాంటి చవకబారు వ్యవహారాలు మానేస్తే మంచిది.

Follow on Google News Follow on Whatsapp

READ  అన్ని సినిమాలూ ఆగస్టులోనే..


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories