Homeబాక్సాఫీస్ వార్తలుథాంక్యూ చిత్రంతో దిల్ రాజుకు తీరని నష్టాలు

థాంక్యూ చిత్రంతో దిల్ రాజుకు తీరని నష్టాలు

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాత దిల్ రాజు జ‌డ్జిమెంట్ పై ఇండస్ట్రీ వర్గాలందరికీ మంచి గురి. ఆయన ఒక సినిమా కంటెంట్ ను చూసి ఫలితం ఇదీ అని చెబితే దానికి ఇక తిరుగు ఉండ‌ద‌న్న‌ది అంద‌రి న‌మ్మ‌కం. చాలా సంద‌ర్భాల్లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగింది కూడా. అయితే దిల్ రాజు ఖాతాలో కూడా కొన్ని ఫ్లాపులు ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో సక్సెస్ పర్సంటేజ్ అలాంటిది కాబట్టి ఎవరికయినా సాధ్య పడదు. అలాంటి కొన్ని సినిమాలు ఊహించని విధంగా ప‌రాజ‌యాల పాలవుతాయి. అయితే వాటిని దిల్ రాజు ముందే చాక చక్యంగా బిజినెస్ విషయంలో వ్యవహరించే వారు. అందువల్ల నష్టాలు కాస్త తప్పేవి. అయితే ఎంత దూరదృష్టి ఉన్నా కొన్నిసార్లు అనుభవజ్ఞులు కూడా తప్పటడుగులు వేస్తుంటారు. అలాంటి అనుభవమే దిల్ రాజుకు “థాంక్యూ” చిత్రంతో ఎదురవుతుంది.

థాంక్యూ తొలిరోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. సరే కనీసం మౌత్ టాక్ బాగుంటే తరువాత పిక్ అప్ అవుతాయి అనుకుంటే అటు రివ్యూలు సినిమాకి చాలా తక్కువ రేటింగ్ లు ఇవ్వగా, ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగా వచ్చింది. తొలి రోజు వచ్చిన కలెక్షన్లు మాత్రమే పుల్ రన్ లో తొంభై శాతంగా పరిగణించవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చాలా సెంటర్లలో ఈ చిత్రం అప్పుడే పర్సెంటేజి రేషియోలో ఆడిస్తున్నారు అంటే కలెక్షన్లు ఎంత దారుణంగా వస్తున్నాయో అర్థం అవుతుంది. వరుసగా హిట్లు కొడుతూ కెరీర్ లో చక్కని దశలో ఉన్న నాగ చైతన్య కు ఈ సినిమా ఫలితం నిరాశను కలిగిస్తుంది. ఈ సినిమా వల్ల ఆయనకు నష్టమే తప్ప ఏ రకంగానూ లాభం చేకూరలేదు.

అక్కినేని నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. వాసువర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పరాజయం పాలైన సంగతి తెలిసిందే. థాంక్యూ సినిమాతో అయినా దిల్ రాజు నాగచైతన్యకు హిట్ ఇచ్చి పాత గాయాన్ని మరచిపోయేలా చేస్తారని అక్కినేని అభిమానులు ఆశించారు. అయితే వారి ఆశలపై నీళ్ళు చల్లినట్లు థాంక్యూ చిత్రం కూడా భారీ పరాజయం దిశగా పయనిస్తుంది.

READ  రామ్ చరణ్ - గ్లోబల్ స్టార్

దిల్ రాజు థాంక్యూ సినిమాను ముందుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారట. ఆ మధ్య ఇదే వార్త కొన్ని రోజులు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది కూడా. అయితే మళ్ళీ ఆ ఆలోచనను మానుకుని థియేటర్లలో విడుదల చేసారట.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories