Homeసినిమా వార్తలుNKR-19: కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు క్రేజీ ఆఫర్

NKR-19: కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు క్రేజీ ఆఫర్

- Advertisement -

నందమూరి వంశం నుండి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్లు గా చలామణి అవుతున్న నటులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీనియర్ నటులు నందమూరి బాలయ్య. ఆ వంశం నుంచే మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్టార్ హీరో కాకపోయినా, తనదైన శైలిలో వైవిద్యమైన సినిమాలు తీస్తూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్ లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఫాంటసీ మరియు టైం ట్రావెల్ సినిమా ‘బింబిసార’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించింది. పైగా ఈ సినిమాని నాలుగు భాగాలుగా ఫ్రాంచైజీ తరహాలో తెరకెక్కిస్తున్నారు అని చిత్ర బృందం చెప్పడం విశేషం.

ఇదే ఊపులో కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాని కూడా ప్రకటించారు. తన 19వ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై NKR19 వర్క్ టైటిల్ తో సినిమా రూపొందుతోంది.

READ  సూర్యకు దక్కిన అరుదైన గౌరవం

తాజాగా కళ్యాణ్ రామ్ 43వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో కళ్యాణ్ ఓ టేబుల్ పై ఉన్న గన్స్ తో సినిమా కథ ఎంటా అని ఆసక్తి కలిగించేలా ఉంది. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి అని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర దక్షిణ రాష్ట్రాలకు కలిపి 12 కోట్ల బిజినెస్ కు ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇంతే ఆసక్తిని ప్రేక్షకుల్లో కూడా కలిగించి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  హ్యాట్సాఫ్ డార్లింగ్ అనిపించుకున్న ప్రభాస్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories