థియేటర్ల వ్యవస్థ రోజు రోజుకూ కుంటు పడుతుంది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా థియేటర్లను నిర్వహించడం యాజమాన్యాలకు సాధ్య పడట్లేదు. అప్పులు చేసి, ఇక్కట్లు పడి థియేటర్లను నడిపే కంటే వాటిని మూసి వేయడమే మంచిదనే భావనలో ఎక్జిబిటర్లు ఉన్నట్లు తెలుస్తుంది.
వారి బాధలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే కరోనా పాండేమిక్ తరువాత ప్రేక్షకుల అభిరుచులు.. అలవాట్లు మారాయి. ఒకప్పుడు 10 సినిమాలు రిలీజ్ అయితే అందులో 6,7 సినిమాల వరకు హీరో పెద్దా చిన్నా అని తేడా లేకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారీ బడ్జెట్ సినిమా అయితేనో.. లేదా పెద్ద హీరో సినిమా బాగా ప్రచారం జరిగి వస్తేనో ప్రేక్షకులు కదలట్లేదు. . ఈ కష్టాలు పడలేక ఆంధ్ర ప్రదేశ్ లో 400 ధియేటర్లు మూసి వేయడానికి నిర్ణయించుకున్నారు.
ఒకప్పుడు పెద్ద సినిమాలకి థియేటర్లులు కళకళ లాడేవి. అదే మీడియం రేంజ్ సినిమాకు ఐతే కనీసం మోస్తరు స్థాయిలో ప్రేక్షకులు హాజరు అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా అటు చిన్న సినిమాగా కాక ఇటు పెద్ద సినిమాగా కాకుండా పోయిన సినిమాలకు అస్సలు ఆదరణ ఉండట్లేదు. ఓటీటీ విప్లవం వల్ల కొన్ని రోజులు ఆగితే ఇంట్లోనే చూసుకోవచ్చు అన్న భావన ప్రేక్షకులలో పెరిగిపోయింది అని పంపిణీదారులు అంటున్నారు.
ఒక థియేటర్ నడిపించాలి అంటే నెలకు 3 లక్షల వరకూ ఖర్చు ఉంటుంది. అదే ఒక ఆటకు అయితే 2 వేల నుంచి 5 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ప్రేక్షకుల హజరుకు గ్యారంటీ అనేది లేకపోవడంతో.. ప్రస్తుతం థియేటర్ల యాజమాన్యాలు కొన్ని రోజులు ధియేటర్లను మూసివేయడం అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం అన్ని పరిశ్రమలు, ప్రజల దైనందిన జీవితాలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న దశలో.. థియేటర్ల వ్యవస్థ కూడా కష్టాలు ఎదురుకోక తప్పదు. తొందరలోనే ఈ పరిస్థితి మారాలని, సమస్యలు అన్నీ తొలగిపోయి మళ్ళీ సినిమాలతో, ప్రేక్షకులతో థియేటర్లులు నిండిపోవాలి అని కోరుకుందాం.