భారత దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షాతో తెలుగు సినీ నటుడు/హీరో జూనియర్ ఎన్టీఆర్ నిన్న సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ పలు పుకార్లకు దారి తీసింది. ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం కేవలం మర్యాదపూర్వక చర్య మాత్రమేనని అని పరిశ్రమలోని ఒక వర్గం అంటుండగా, మరి కొందరు మాత్రం ఈ విషయం పైకి కనిపించేంత సాధారణ విషయం కాదని, ఏదో గుడార్థం దాగి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రజాకార్ల ఉద్యమాన్ని వీరోచితంగా చూపిస్తూ రజాకార్ ఫైళ్లపై సినిమా చేయడానికి బిజెపి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోందట. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. బిజెపి పార్టీ సంభందిత వర్గాల ప్రకారం.. ఈ సినిమాలో నటించమని ఎన్టీఆర్‌ని బీజేపీ అభ్యర్థించినట్లుగా సమాచారం. ఈ చిత్రం ఇతివృత్తం హిందూ మతానికి సంబంధించినది, ఇది బిజెపి పార్టీ ప్రధాన సందేశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ఉనికిని గుర్తించడంలో.. సినిమా ద్వారా తమ ఉద్దేశ్యాలు చేరుకునేందుకు సహాయపడుతుంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనను ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో మెచ్చుకున్నారు. అంతే కాకుండా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ఈ పాపులారిటీని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా ఈ సినిమా కార్యరూపం దాల్చితే గనక ఖచ్చితంగా భారీ స్థాయిలో రూపొందే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి పని చేయనున్నారు. వీరివురూ ఇది వరకు కలిసి పని చేసిన జనతా గారేజ్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. కాగా ఎన్టీఆర్ 30వ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో పాటు హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సోషల్ మీడియాలో వైరల్ అయింది.