Homeసినిమా వార్తలుఅప్పుడు ఆఫీసర్ - ఇప్పుడు థాంక్యూ

అప్పుడు ఆఫీసర్ – ఇప్పుడు థాంక్యూ

- Advertisement -

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం థాంక్యూ సినిమా ఈ వారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మొదటి రోజునే నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది. అంతే కాకుండా మొదటి రోజు నుండి కలెక్షన్స్ పరంగా పూర్తిగా దిగువ స్థాయిలో వెళుతుంది. సరే మొదటి రోజు అంతో ఇంతో పర్వాలేదు అనిపించిన కలెక్షన్లు రెండో రోజు నుంచి మరింత దారుణంగా పడిపోయాయి.

ఇక సాధారణంగా తెలుగు సినిమాలకు మూడో రోజు ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకుని మంచి కలెక్షన్లు రాబడతాయి. అయితే థాంక్యూ సినిమా ఆ మూడో రోజు అడ్వాంటేజ్ కూడా ఏమాత్రం ఉపయోగించుకోలేదు. చాలా సెంటర్ల లో డెఫిసిట్ లు మూటగట్టుకుని నెగటివ్ షేర్ ను తెచ్చుకోవడం గమనార్హం.

ఇలా అతి తక్కువ కలెక్షన్లతో సినిమా షేర్ ఏ రావడం గగనం అయినందున, చాలా సెంటర్లలో పర్సంటేజ్ విధానంలో థాంక్యూ చిత్రాన్ని అడిస్తున్నారు. అందువల్ల సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఆసలు షేర్ గా పరిగణించబడదు. ఇలా జీరో షేర్ సినిమాను ఇవ్వడం అక్కినేని వారికి కొత్తేమీ కాదు.

READ  మేజర్ OTT విడుదల తేదీ ఖరారు

హీరో నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో 2018 లో వచ్చిన “ఆఫీసర్” చిత్రం కూడా అప్పట్లో జీరో షేర్ సినిమాగా నిలిచింది. ఇండస్ట్రీలో హిట్లు సూపర్ హిట్లు ఎలా ఉంటాయో.. ఫ్లాప్ లు మరియు భారీ డిజాస్టర్ లు కూడా ఉంటాయి. అయితే ఇలా ఒకే కుటుంబానికి చెందిన హీరోలు ఇలా జీరో షేర్ రికార్డులు తమ పేరిట మూటగట్టుకోవడం కాస్త విడ్డూరంగానూ, వారి అభిమానులకు అత్యంత బాధాకరంగా ఉంటుంది.

ఈ భారీ పరాజయం నుంచి కోలుకోవాలి అంటే నాగ చైతన్య తన తదుపరి చిత్రంతో గట్టి హిట్ నే కొట్టాలి.ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెలుగు / తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్.. వీరిద్దరూ కలిసి ఇదివరకు బంగార్రాజు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు పరశురామ్ తోనూ నాగ చైతన్య ఒక సినిమా చేయాల్సి ఉంది.ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన “లాల్ సింగ్ చడ్డా” చిత్రంలో నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది.

READ  NBK 107: బాలకృష్ణ సినిమాని వదలని కరోనా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories