Homeసినిమా వార్తలుఅన్ని సినిమాలూ ఆగస్టులోనే..

అన్ని సినిమాలూ ఆగస్టులోనే..

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా (SSMB28) వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ వారు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత మహేష్ అభిమానుల ఆనందానికి అంతు లేదు. అయితే ఆగస్టులో ఆ ఒక్క సినిమానే షూటింగ్ ప్రారంభించట్లేదు అని తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న పుష్ప 2 షూటింగ్ కూడా ఆగస్టులో మొదలు అవుతుంది. స్క్రిప్ట్ వర్క్ లో కాస్త జాప్యం, సుకుమార్ అరోగ్య కారణాల వల్ల మరి కొంత ఆలస్యం అయిన ఈ చిత్రం షూటింగ్.. ఎట్టకేలకు ఆగస్టులో మొదలు కానుంది. అటు ప్రేక్షకుల నుంచి ఇటు ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పై సుకుమార్ అత్యంత శ్రద్ధ వహించారని సమాచారం.

ఇక ఎన్టీఆర్ – కొరటాల శివల కలయికలో వస్తున్న సినిమా కూడా ఇదే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలతో మొదలవుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2018 లో వచ్చిన అరవింద సమేత తరువాత నాలుగేళ్లకు ఆర్ ఆర్ ఆర్ తో తెరపై కనిపించారు ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కూడా ఆలస్యం అయితే ఎలా అని అభిమానులు కాస్త నిరాశతో ఉన్న దశలో ఈ వార్త ఖచ్చితంగా వారికి ఆనందాన్ని ఇచ్చేదే.

READ  నారప్ప తో ఖిలాడి అంటున్న అడ్డాల

ఇక పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కూడా ఆగస్ట్ లోనే షూటింగ్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సినిమా తమిళ చిత్రం ” వినోదాయ సితం” కు రీమేక్. మాతృకకి దర్శకత్వం వహించి.. ముఖ్య పాత్రలో కూడా కనిపించిన సముద్రఖని దర్శకత్వంలో ఈ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరో సాయి తేజ్ మరో హీరోగా చేస్తుండగా, భీమ్లా నాయక్ సినిమాలో క్యూట్ గా కనిపించి ప్రేక్షకులను అలరించిన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇలా అన్ని సినిమాకు అందులోనూ పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి ఓకే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న తరుణంలో ఆయా చిత్రాలకు సంభంధించిన అప్డేట్ లు , ప్రచార కార్యక్రమాలతో అభిమానులు సందడి చేయదానికి సిద్ధంగా ఉన్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  భారీ అంచనాలను రేకెత్తిస్తున్న లైగర్ కొత్త పోస్టర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories