Homeసినిమా వార్తలుఆచార్య ఫలితంతో నాకు సంబంధం లేదన్న చిరంజీవి

ఆచార్య ఫలితంతో నాకు సంబంధం లేదన్న చిరంజీవి

- Advertisement -

కొరటాల శివ అంటే నిన్న మొన్నటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో పేరు ఉండేది. అయితే ఒక్క సినిమాతో ఆయన పరిస్థితి తలక్రిందులు అయింది. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్న నేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి’ వంటి విజయవంతమైన సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారారు కొరటాల శివ. ఆ సినిమా ఘన విజయం సాధించి కొరటాలను స్టార్ డైరెక్టర్ ల లిస్ట్ లో చేరేలా చేసింది. ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ వంటి సినిమాలతో వరుసగా స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్లతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇన్ని హిట్ సినిమాలు ఉన్న కొరటాలను ఒకే ఒక్క సినిమా అటు కెరీర్ పరంగా ఇటు ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బతీసింది. అదే ‘ఆచార్య’.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కలసి నటించిన ఈ సినిమా నిర్మాణం దాదాపు మూడేళ్ల పాటు కొనసాగింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం తో పాటు బిజినెస్ లోనూ ఇన్వాల్వ్ అయ్యారు కొరటాల శివ. అదే ఆయనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ కావటంతో అన్ని ఏరియాల నుంచి కొనుగోలు దారులు నష్టపోయిన మొత్తాలను చెల్లించాలని కొరటాలపై వత్తిడి తెచ్చారు. చాలా వరకు ఈ వ్యవహారాలను పెద్ద సమస్యగా మారకుండానే సెటిల్ చేశారు కొరటాల మరియు ఆయన స్నేహితుడు సుధాకర్. అయితే సీడెడ్ ఏరియాకు సంబంధించిన వ్యవహారం మాత్రం కాస్త వివాదం అవడం.. ఎగ్జిబిటర్స్ తమ డబ్బు చెల్లించాలని కొరటాల ఆఫీస్ కు వెళ్ళి వత్తిడి చేయడం వంటి సంఘటనలతో సమస్య తీవ్రత పెరిగింది. కొరటాల నేరుగా వచ్చి హామీ ఇస్తే కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. అలా ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకుని ఆచార్య చిత్రం యొక్క ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేశారు కొరటాల. అయితే తాజాగా ఆయన పై మరి అభియోగం మోప బడింది.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన “లాల్ సింగ్ చడ్డా” చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం తాలూకు తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చలకు దారి తీస్తున్నాయి.

READ  Rajamouli: రస్సో బ్రదర్స్ అభిమానం చూరగొన్న రాజమౌళి

ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే.. ” నేను ఎప్పుడూ సినిమాలు తీసెప్పుడు అవి జనాదరణ పొందాలి, జనామోదంగా ఉండాలి అని మినిమం గ్యారెంటీ సినిమాలు తీస్తుంటాను, అమీర్ అలా కాదు.. ఆయన.ప్రయోగాత్మకంగా సినిమాలు తీయడం కాకుండా ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటారు. అదే నేను అయితే ఏం చేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడతారో, శభాష్ అంటారో అలాంటి సినిమాలు చేస్తాను, కాకపోతే మధ్యలో నా ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి వాటి గురించి నేను మాట్లాడదల్చుకొలేదు” అని.చిరంజీవి అన్నారు.

ఆయన అన్న మాటలు పరోక్షంగా ఆచార్య చిత్రం గురించి మరియు దర్శకుడు కొరటాల శివ గురించి అని అందరికీ అర్థం అయింది. అయితే ఇండస్ట్రీలో ఇంత సీనియర్ నటుడు మరియు హీరో అయి ఉండి చిరంజీవి ఇలా మాట్లాడటం ఏంటని ఆ విడియో చూసిన ప్రేక్షకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories