Homeసినిమా వార్తలుVamsi Paidipally Movie Fix with Aamir Khan అమీర్ ఖాన్ తో వంశీ మూవీ...

Vamsi Paidipally Movie Fix with Aamir Khan అమీర్ ఖాన్ తో వంశీ మూవీ ఫిక్స్ ?

- Advertisement -

టాలీవుడ్ లో మంచి హృద్యమైన కథ, కథనాలతో సినిమాలు తీసే దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. తొలిసారిగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఆయన తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మున్నా. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన చేసిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ మూవీ బృందావనం మంచి విజయం అందుకుంది. 

ఆ తరువాత నాగార్జున, కార్తీ ల కలయికలో ఊపిరి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి, ఇటీవల విజయ్ తో వారసుడు వంటి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ తీసి అందరినీ ఆకట్టుకున్నారు వంశీ పైడిపల్లి. ఇక త్వరలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ తో ఆయన ఒక మూవీ చేసేందు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబో మూవీ పై టాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 

కాగా అమీర్ ఖాన్ ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించిన వంశీ, త్వరలో పూర్తి స్క్రిప్ట్ వినిపించేందుకు సిద్దమవుతున్నారట. అయితే తన కెరీర్ లో మూవీస్ సెలక్షన్ విషయంలో ఎంతో జాగ్రత్తగా అలోచించి ఎంపిక చేసుకునే అమీర్ ఖాన్ ని వంశీ ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి. అలానే వీరిద్దరి మూవీ సెట్ అయితే త్వరలో దీనికి సంబంధించి టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు అమీర్ ఖాన్

READ  Game Changer Day 1 Pre Sales Estimation 'గేమ్ ఛేంజర్' ప్రీ సేల్స్, డే 1 అంచనా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories