పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల నాగ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. దీని అనంతరం ప్రస్తుతం ఆయన చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సలార్ 2, హను రాఘవపూడి తీయనున్న మూవీ, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ఉన్నాయి.
ఈ మూడింటి పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ తీయనున్న స్పిరిట్ ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే దీని కథ సిద్ధం చేసిన సందీప్, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ని పూర్తి చేసేపనిలో ఉన్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
విషయం ఏమిటంటే, ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనుండగా ఆయనకు జోడీగా కోలీవుడ్ స్టార్ నటి త్రిష జతకట్టనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఆనిమల్ కి వర్క్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి సంబంధించి పూర్తి డిటైల్స్ త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.