Homeసినిమా వార్తలువీకెండ్ లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్న 'థగ్ లైఫ్'

వీకెండ్ లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్న ‘థగ్ లైఫ్’

- Advertisement -

చాలా ఏళ్ళ విరామం అనంతరం కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీలో శింబు  పాత్ర చేయగా త్రిష హీరోయిన్ గా నటించింది.

ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో తనికెళ్ళ భరణి, నాజర్, మహేష్ మంజ్రేకర్, అభిరామి తదితరులు ఇతర పాత్రలు చేసారు. మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మూవీస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ డే నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు ఈ మూవీ రూ. 72 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది. తమిళ నాడులో కేవలం రూ. 33 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఇతర ప్రాంతాల్లో ఈ వీకెండ్ లో దారుణంగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తోంది. థగ్ లైఫ్ యొక్క బ్రేకీవెన్ రూ. 300 కోట్లు కాగా ఈ వీకెండ్ లో మూవీ మొత్తంగా 25% మాత్రమే రాబట్టే అవకాశం ఉంది.

READ  'అఖండ - 2' టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ 

దీనిని బట్టి ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2 తో పోలిస్తే డబుల్ డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. ఎప్పుడో గతంలో నాయగన్ కాంబో క్రేజ్ తో వచ్చిన ఈ మూవీ మొత్తంగా ఇంత ఘోరంగా కొనసాగుతుండడంతో కమల్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories