సినిమా పేరు: థగ్ లైఫ్
రేటింగ్: 2/5
తారాగణం: కమల్ హాసన్, సిలంబరసన్ TR, త్రిష, అభిరామి, నాజర్, జోజు జార్జ్ మరియు ఇతరులు
దర్శకుడు: మణిరత్నం
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్
విడుదల తేదీ: 5 జూన్ 2025
కమల్ హాసన్ మరియు మణిరత్నం కలిసి చాలా ఏళ్ళ అనంతరం వర్క్ చేసిన మూవీ థగ్ లైఫ్. ఈ మూవీలో శింబు మరొక కీలక పాత్ర చేయగా త్రిష హీరోయిన్ గానటించింది . ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన దీని యొక్క ట్రైలర్ ఇటీవల అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా హైప్ ఏర్పరిచింది. నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ డిటైల్డ్ రివ్యూ ఇప్పుడు చూద్దాం
కథ :
రంగరాయ శక్తివేల్ అనే గ్యాంగ్ స్టర్ అనుకోకుండా ఒకానొక సందర్భంలో కనపడిన ఒక బాలుడు అమర్ ని పెంచి పెద్ద చేస్తాడు. ఆపైన వారి చుట్టూ ఉన్న సంఘర్షణలు, శక్తి జీవితాన్ని నాశనం చేసే ఒత్తిళ్ల నడుమ ఏమి జరుగుతుంది అనేది మొత్తమే ఈ సినిమా యొక్క ప్రధాన కథ
నటీనటులు పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా ఈ మూవీలో కమల్ హాసన్ తన శక్తివేల్ పాత్రలో ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. అలానే మరొక నటుడు శింబు కూడా ఎంతో సూపర్ గా ఆకట్టుకున్నారు. పలు కీలక యాక్షన్ సీన్స్ లో వీరిద్దరి నటన ఎంతో బాగుంది.
అయితే శింబు క్యారెక్టర్ లో మరింత బలమైన డెప్త్ ఉంటె బాగుండేది. త్రిష బాగా నటించినప్పటికీ ఆమె పాత్ర వేస్ట్ అనిపిస్తుంది. అలానే ఐశ్వర్య లక్ష్మి పాత్ర చిన్నదైనప్పటికీ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇతర ముఖ్య పాత్రలు చేసిన నాసర్, అభిరామి, తనికెళ్ల భరణి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్ మరియు అలీ ఫజల్ పాత్రలు జస్ట్ ఓకె.
విశ్లేషణ :
ఈ మూవీ ద్వారా మణిరత్నం గ్యాంగ్ స్టర్ లైఫ్ లోని రిలేషన్ బాండింగ్ అనే అంశాలను తీసుకుని తెరకెక్కించారు. సెటప్ అంతా కూడా ఆర్డినరీగా అనిపించినప్పటికీ శక్తివేల్, అమర్ ల మధ్య సీన్స్ బాగున్నాయి. 90 ల కాలం నాటి కథగా ప్రారంభం అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా లేని స్క్రీన్ ప్లే తో పాత్రలు బాగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు.
ఇంటర్వెల్ ఆకట్టుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ మెల్లగా డల్ గా సాగుతుంది. రేవేంజ్ డ్రామాగా సాగిన ఈ మూవీలో శక్తివేల్, అమర్ ల మధ్య సంఘర్షణకు దరి తీసే సీన్స్ కన్ఫ్యూషన్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నప్పటికీ మొత్తంగా డల్ గా సాగె మూవీని అద కాపాడలేకపోయింది.
ప్లస్ పాయింట్స్ :
- ప్రారంభ 15-20 నిమిషాలు
- విజువల్స్
- ఇక్కడ కొన్ని మంచి సంభాషణలు
మైనస్ పాయింట్స్ :
- సరైన భావోద్వేగాలు లేకపోవడం
- రచన / పాత్రలు సరిగా లేకపోవడం
- క్లూలెస్ సెకండ్ హాఫ్
- క్లైమాక్స్ లోపించడం
- పాటలు ఆకట్టుకోకపోవడం
తీర్పు :
మొత్తంగా నేడు ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన కమల్ హాసన్, మణిరత్నం ల క్రేజీ కాంబినేషన్ మూవీ థగ్ లైఫ్ ఆకట్టుకోదు. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించినా ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా డల్ గా సాదాసీదా సీన్స్ తో సాగుతుంది. కమల్, శింబు ల నటన ప్రారంభం లో వచ్చే సీన్స్ తో పాటు విజువల్స్, కొన్ని డైలాగ్స్ తప్పించి ఇందులో పెద్దగా బలాలుగా ఏవి అనిపించవు. మధ్యలో కీలక సీన్స్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో పాటు, సాంగ్స్ ఆకట్టుకోకపోవడం, ఎమోషనల్ డెప్త్ మిస్సింగ్ వంటివి మైనస్ లు.