HomeMovie News'ది రాజాసాబ్' ప్రీ టీజర్ ఎలా ఉందంటే ?

‘ది రాజాసాబ్’ ప్రీ టీజర్ ఎలా ఉందంటే ?

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ పాన్ ఇండియన్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఫై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా గా నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న పలు భాషల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

కాగా రేపు ఉదయం 10 గం. 52 ని. లకు ది రాజాసాబ్ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక కొద్దిసేపటి క్రితం దాని యొక్క ప్రీ టీజర్ ని రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

హీరోయిన్స్ ముగ్గురు సహా నటుడు సుప్రీత్ మరికొందరు ఒక పెద్ద బంగ్లాని ఆశ్చర్యంగా చూస్తున్న ఆ ప్రీ టీజర్ బైట్ మొత్తంగా రేపు రానున్న టీజర్ పై బాగానే ఇంట్రెస్ట్ ఏర్పరిచింది. మరి ఈ మూవీతో ప్రభాస్, మారుతి ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి. 

See also  'ది రాజాసాబ్' టీజర్ : అంతా ఆయన చేతుల్లోనే ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories