Homeసినిమా వార్తలుAllu Arjun: ప్రభాస్ కంటే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అని నిరూపించడానికి ఫేక్ ప్రచారం...

Allu Arjun: ప్రభాస్ కంటే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అని నిరూపించడానికి ఫేక్ ప్రచారం చేస్తున్న పీఆర్ టీం

- Advertisement -

అల్లు అర్జున్ కి మొత్తం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ అండ్ స్ట్రాంగ్ పీఆర్ టీం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ సూపర్ స్టార్ గా ఎదగడానికి ప్రధాన కారణాల్లో పీఆర్ టీం కూడా ఒకటని చెప్పవచ్చు. తాజాగా అల్లు అర్జున్ తన కొత్త సినిమా కోసం టి సిరీస్ సంస్థతో 120 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ కు సంతకం చేసినట్లు ఆయన పీఆర్ టీం ప్రచారం మొదలు పెట్టింది.

ఇటీవల అల్లు అర్జున్ దర్శకుడు సందీప్ వాంగాతో టీ సిరీస్ సంస్థ నిర్మించనున్న సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ పీఆర్ టీం చేస్తున్న ప్రచారం ప్రకారం 120 కోట్ల మొత్తం ఒక తెలుగు హీరోకు ఆల్ టైమ్ రికార్డ్ రెమ్యునరేషన్ అనేది వాస్తవం కాదు.

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే తన సినిమాలకు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మారుతి సినిమా హిట్ అయితే 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన సినిమా లాభాల రూపంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న స్టార్లకు 120 కోట్లు అనేది చాలా కామన్ రెమ్యూనరేషన్. ఇది కేవలం ప్రభాస్ కంటే బన్నీ ఏ పెద్ద స్టార్ అని నిరూపించుకోవడానికి అల్లు అర్జున్ పీఆర్ టీం చేస్తున్న ఫేక్ ప్రచారం మాత్రమే.

READ  RRR Re Release: USAలో 200కి పైగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా

ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రధాన అమీర్ పేట కూడలిలో నిర్మిస్తున్న ఒక మల్టీప్లెక్స్ కు ఆయన ముఖ్య భాగస్వాముల్లో ఒకరు. ఇక ఈ మల్టీప్లెక్స్ లో మరిన్ని విశేషమైన ఏర్పాట్లు చేయనున్నారు.

అంతే కాకుండా అల్లు అర్జున్ వర్చువల్ విగ్రహం కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ విగ్రహాన్ని మల్టీప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచనున్నట్లు తెలుస్తోంది. లాంచ్ రోజున మల్టీప్లెక్స్ ఆవరణలోని వివిధ మూలల్లో 100కు పైగా ఎల్ఈడీ స్క్రీన్లను ప్లే చేయనున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ దాదాపుగా సిద్ధమైంది. దీనికి AAA (ఏషియన్ అల్లు అర్జున్) సినిమాస్ అలియాస్ ఏషియన్ సత్యం అని పేరు పెట్టనున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Pushpa 2: పుష్ప 2 కోసం ప్రధానంగా హిందీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్న సుకుమార్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories