HomeMovie NewsSudheer Babu: ‘హరోం హర’ అంటూ సరికొత్తగా దిగుతున్న సుధీర్ బాబు!

Sudheer Babu: ‘హరోం హర’ అంటూ సరికొత్తగా దిగుతున్న సుధీర్ బాబు!

- Advertisement -

Sudheer Babu: టాలీవుడ్‌లో నైట్రో స్టా్ర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయని ప్రేక్షకుల్లో ఓ భావన ఉంది. అందుకే ఆయన చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ హిట్ అని అభిమానులు అంటుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత సుధీర్ బాబు మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు.

అయితే హంట్ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చాడు ఈ యంగ్ హీరో. దర్శకుడు జ్ఞానసాగర ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. అంతేగాక ఈ సినిమాలో భక్తికి సంబంధించి కూడా ఓ కీలక అంశం ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘‘హరోం హర – ది రివోల్ట్’’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా.. కుప్పం ప్రాంతంలో 1989లో జరిగిన ఓ యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించనున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

See also  మాల్దీవులలో విహారయాత్ర చేయనున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న

ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘‘ఇంగ సెప్పేదేమీ లేదు.. సేసేదే’’ అంటూ సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక చైతన్ భరద్వా్జ్ సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

See also  ఓవర్సీస్ వద్ద 20 మిలియన్ మార్కుకు చేరువలో పొన్నియిన్ సెల్వన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories