Homeసినిమా వార్తలుపూరి -  విజయ్ సేతుపతి మూవీ హీరోయిన్ గా స్టార్ నటి ?

పూరి –  విజయ్ సేతుపతి మూవీ హీరోయిన్ గా స్టార్ నటి ?

- Advertisement -

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల కెరీర్ పరంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఉస్తాద్ రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబుల్ ఇస్మార్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరాతి ఘోరంగా డిజాస్టర్ గా నిలిచి పూరి కెరీర్ కి మరింత పెద్ద మచ్చ వేసింది.

అనంతరం ఇకపై తన నుండి వచ్చే సినిమాల విషయమై ఒకింత జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించేందుకు ఆలోచన చేసారు పూరి జగన్నాథ్. ఇక కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో ఆయన తన నెక్స్ట్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని తన పూరి కనెక్ట్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీలో టబు ఒక కీలక పాత్ర చేస్తుండగా హీరోయిన్ గా త్రిష నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను ప్రత్యేకంగా కలిసి కథ వినిపించారట దర్శకుడు పూరి జగన్నాథ్.

ఇక ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి బెగ్గర్ అనే వర్కింగ్ టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. త్వరలో అఫీషియల్ గా అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ మూవీని త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు దర్శకుడు పూరి అండ్ టీమ్ ప్లే చేస్తోందట. 

Follow on Google News Follow on Whatsapp

READ  Puri Jagannath Movie with Vijay Sethupathi విజయ్ సేతుపతి తో పూరి జగన్నాథ్ మూవీ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories