Homeసినిమా వార్తలుసూర్య కి తెలుగు ఆడియన్సు నుండి దెబ్బ మీద దెబ్బ 

సూర్య కి తెలుగు ఆడియన్సు నుండి దెబ్బ మీద దెబ్బ 

- Advertisement -

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య కొన్నేళ్ల క్రితం ఏ ఆర్ మురుగదాస్ తీసిన గజినీ సినిమా ద్వారా తెలుగు సినిమాల్లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇక అక్కడి నుండి మెల్లగా ఇక్కడ కూడా ఆయన మార్కెట్ పెరిగింది.

అలానే తన సినిమాలతో ఎప్పటికప్పుడు తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే సూర్య, ఇటీవల కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల సిరుత్తై శివ దర్శకత్వంలో ఆయన చేసిన భారీ మూవీ కంగువ ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. ఇటు తెలుగు ఆడియన్స్ నుండి కూడా ఆ మూవీ తిరస్కారం ఎదుర్కొంది.

అనంతరం తాజాగా వచ్చిన రెట్రో మూవీ ఓవరాల్ గా రూ. 100 కోట్లకు ఇంకా తక్కువ మార్క్ వద్దే ఆగిపోయింది. ఈ మూవీ కూడా తెలుగులో ఫ్లాప్ అయింది. అయితే విషయం ఏమిటంటే, కంగువ ఓటిటి వర్షన్ కూడా తెలుగులో తిరస్కారం ఎదుర్కోగా, ఇటు రెట్రో పరిస్థితి కూడా ప్రస్తుతం అలానే ఉంది.

లేటెస్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయిన రెట్రో తెలుగు వర్షన్ కి కూడా స్పందన శూన్యం. ఈ విధంగా తెలుగు ఆడియన్స్ నుండి బ్యాక్ తో బ్యాక్ సూర్య సినెమాలకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఇక ప్రస్తుతం ఆర్ జె బాలాజీతో ఒక మూవీ చేస్తున్న సూర్య ఓవైపు వాడివాసల్ మూవీ కూడా లైన్లో పెట్టారు.

అలానే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా ఆయన మూవీ అనౌన్స్ చేసారు. మొత్తంగా ఈ మూడు సినిమాలతో సూర్య ఎంతమేర విజయాలు అందుకుంటారో చూడాలి. 

READ  లోకేష్ కనగరాజ్ LCU ప్లానింగ్ ఇదే

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories