వెబ్ సిరీస్ పేరు: రానా నాయుడు సీజన్ 2
రేటింగ్: 2.5 / 5
నటీనటులు: రానా దగ్గుబాటి, దగ్గుబాటి వెంకటేష్, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బండా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ
మరియు డినో మోరియా
దర్శకులు: సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్
స్ట్రీమింగ్ : నెట్ ఫ్లిక్స్ లో
అమెరికన్ టెలివిజన్ సిరీస్ రే డొనోవాన్ ఆధారంగా తెరకెక్కిన రానా నాయుడు సీజన్ 1 ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయి తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇక తాజాగా దానికి సీక్వెల్ గా రానా నాయుడు 2 నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. మరి ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
రానా నాయుడు (రానా దగ్గుబాటి) తన ఫిక్సర్ జాబ్ వదిలి హ్యాపీగా ఫ్యామిలీ తో జీవిస్తుంటాడు. అయితే అనంతరం ఒకానొక సమయంలో అతడి కొడుకు కిడ్నప్ కి గురవుతాడు. అయితే తన ఫ్యామిలీ ని కాపాడుకోవడానికి విక్రమ్ ఒబెరాయ్ గ్రూప్ లో చేరతాడు రానా నాయుడు. (రజత్ కపూర్).
విక్రమ్ ఒబెరాయ్ కూతురు అలియా ఒబెరాయ్ (కృతి కర్బందా) ఒక క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేయాలనుకుంటుంది. అయితే అదే సమయంలో రానా నాయుడు పై ప్రతీకారం తీర్చుకోవాలని కసితో రగిలిపోతున్న పొలిటీషియన్ ఓబీ మహాజన్ (రాజేష్ జైస్), రౌఫ్ భాయ్ (అర్జున్ రామ్ పాల్ ) అనే రౌడీ డాన్ ని జైలు నుండి విడిపించి తీసుకువస్తాడు.
మరి ఆ తరువాత ఏమి జరిగింది, ఇంతకీ రౌఫ్ భాయ్ బారి నుండి తన కుటుంబాన్ని రానా నాయుడు కాపాడుకుంటాడా లేదా, అనంతరం అతడి తండ్రి నాగ (వెంకటేష్) ఏవిధంగా ఇతడికి సహాయం చేస్తాడు, ఆపైన కథ చివరకు ఏవిధంగా ముందుకు సాగింది అనేది మొత్తం కూడా సిరీస్ లో చూడాల్సిందే .
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ఇక రానా నాయుడు పాత్రలో మరొక్కసారి తన ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించారు హీరో రానా దగ్గుబాటి. పలు కీలక యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన ఎంతో బాగుంది. ఇక నాగ పాత్రలో ఎప్పటివలే అదరగొట్టిన విక్టరీ వెంకటేష్ ఈ సిరీస్ లో మరింత అలరిచారు. అలానే అర్జున్ రామ్ పాల్, కృతి కర్బందా, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా, రజత్ కపూర్ తదితరులు తమ యొక్క పాత్రల్లో ఆకట్టుకున్నారు అని చెప్పాలి. ‘
విశ్లేషణ :
ఇక రానా నాయుడు సీజన్ 2 లో సెలబ్రిటీస్ యొక్క సమస్యలను పరిష్కరించి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రానా నాయుడు భయంకరమైన వ్యక్తులతో కలుస్తాడు. అయితే దాని వలన భార్య తో అతడి రిలేషన్ ఇబ్బందికరంగా మారుతుంది. అందువలన వారి కొడుకు ఆని, కూతురు నిత్య సమస్యలు ఎదుర్కొంటారు.
ఇక ఈ సిరీస్ లో దర్శకులు ముఖ్యమైన డ్రామా పై ఎక్కువగా ఫోకస్ చేసారు. రానా పాత్ర రాను రాను ఆకట్టుకుంటుంది, అలానే మధ్యలో వచ్చే ట్విస్ట్ లు పర్వాలేదనిపిస్తాయి. ఆసక్తికరంగా ప్రారంభం ఉన్నప్పటికీ మెల్లగా కథ నార్మల్ గా సాగుతుంది. హీరో ఫ్యామిలీ సమస్యల్లో ఇరుక్కునే సీన్స్ అన్ని కామన్ గా ఉంటాయి. హీరో పై రౌఫ్ రివెంజ్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించద్దు, అలానే వెంకటేష్ పాత్ర కూడా సీజన్ 1 తో పోలిస్తే పెద్దగా ఆకట్టుకోదు.
ఎటువంటి సమస్యని అయినా యిట్టె సాల్వ్ చేయగల నెంబర్ వన్ ఫిక్సర్ రానా నాయుడు అనేది మనకు తెలిసిందే. అందుకే అతడి ఫ్యామిలీ సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు అతడి నుండి వచ్చే ప్రతిస్పందన ఊహకు అందని విధంగా ఉండాలి, కానీ ఇందులో అంత మాములుగా అనిపిస్తుంది. ఈ సీజన్ యొక్క ఎండింగ్ బాగుంది, అలానే అది మూడవ సీజన్ కి అలానే నాగ ఎదుగుదలకి లీడ్ ఇస్తుంది. మొత్తంగా సీజన్ 2 అస్పష్టంగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
ప్రారంభ సీన్స్
చివరి రెండు ఎపిసోడ్లు
కొన్ని కీలకమైన సన్నివేశాలు / సంభాషణలు
మైనస్ పాయింట్స్ :
ఊహించదగిన / సాధారణ సీన్స్
సరిపోని యాక్షన్ సీన్స్
హీరో మరియు విలన్ల మధ్య నార్మల్ సన్నివేశాలు
తీర్పు :
మొత్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన రానా నాయుడు సీజన్ 2 ప్రారంభంలో కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ అక్కడక్కడా పలు సీన్స్ తప్ప మొత్తంగా అయితే ఎంతో సాదాసీదాగా సాగుతూ అస్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఫైనల్ రెండు ఎపిసోడ్స్ బాగుంటాయి. మొత్తంగా రానా, వెంకటేష్ ల నటన బాగుంది. వీలైతే దీనిని నెట్ ఫ్లిక్స్ లో ఒక లుక్ వేయండి.