Homeసినిమా వార్తలుRam Changer Movie Business 'గేమ్ ఛేంజర్' కు అది బాగా దెబ్బేసిందా ?

Ram Changer Movie Business ‘గేమ్ ఛేంజర్’ కు అది బాగా దెబ్బేసిందా ?

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని దర్శకుడు శంకర్ గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి ఎస్ థమన్ సంగీత దర్శకుడు. ఈ మూవీని డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. విషయం ఏమిటంటే, ఇటీవల శంకర్ తీసిన భారతీయుడు 2 మూవీ భారీ డిజాస్టర్ చవిచూడడంతో ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై పడినట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

ముఖ్యంగా పలు ప్రాంతాల్లో బయ్యర్స్ ఈ మూవీని కొనుగోలు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ మూవీకి రామ్ చరణ్ క్రేజ్ మాత్రమే ఒకింత బలమని, మరి శంకర్ దీనిని ఏ స్థాయిలో సక్సెస్ చేస్తారనేది అందరిలో అయోమయంగా మారిందనేది కొన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్న అనుమానం. మొత్తంగా అయితే భారతీయుడు 2 డిజాస్టర్ వ్యవహారం గేమ్ ఛేంజర్ బిజినెస్ పై బాగానే దెబ్బేసినట్లు క్లియర్ గా అర్ధమవుతోంది.

READ  Double Ismart Trailer 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories